![]() |
![]() |

తప్పుడు, బోగస్ ఆరోపణలు చేసినందుకు గాను తన పొరుగింటామె డింపుల్ తవానీపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీబీఐని రియా చక్రవర్తి కోరినట్లు తాజా సమాచారం. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌తో జూన్ 13న అంటే, అతను మృతి చెందిన ముందు రోజు రియా చక్రవర్తితో కలిసి జంటగా చూసినట్లు, ఆమెను ఇంటిదగ్గర డ్రాప్‌చేసి అతను వెళ్లినట్లు తను చేసిన వాదనలను సీబీఐ ప్రశ్నించినప్పుడు డింపుల్ నిరూపించలేకపోయిందని వార్తలు వచ్చాయి.
న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం, జూన్ 13న రియా, సుశాంత్ కలిసి కనిపించారని ఓ ప్రత్యక్ష సాక్షి తనకు చెప్పినట్లు, అంతేకానీ తాను ప్రత్యక్షంగా చూడలేదని ఆమె తెలిపింది. అయితే ఆ సాక్షి ముందుకు రావడానికి అసౌకర్యంగా ఫీలవుతున్నట్లు సీబీఐ దగ్గర డింపుల్ పేర్కొన్నదని సమాచారం. దీంతో తనపై ఫాల్స్, బోగస్ ఆరోపణలు చేసిన డింపుల్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా సీబీఐని రియా రిక్వెస్ట్ చేసింది. తప్పుడు ఆరోపణలు చేయడం ఐపీసీలోని 203, 211 సెక్షన్ల ప్రకారం నేరం కింద వస్తుందని కూడా ఆమె పేర్కొన్నట్లు ఆ న్యూస్ రిపోర్ట్ తెలిపింది.
సీబీఐకి రాసిన లేఖలో తన పొరుగింటామె డింపుల్ తవానీ చేసిన ఆరోపణలు కానీ, వాటిని రిపబ్లిక్ టీవీలో ప్రసారం చేయడం కానీ ఎంత తీవ్రమైనవో పేర్కొంది. సుశాంత్‌సింగ్ కేసులో రియాపై తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్లందరిపైనా చర్యలు తీసుకోవాల్సిందిగా సీబీఐని కోరుతున్నామని ఆమె లాయర్ సతీశ్ మనేషిండే మీడియాతో చెప్పిన తర్వాత సీబీకి రియా ఈ లేఖ పంపింది.
![]() |
![]() |