![]() |
![]() |

సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ పోస్ట్‌మార్టమ్, విసెరా రిపోర్టులను పునఃపరిశీలించిన ఆల్ ఇండియా ఇన్‌స్టిస్టూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్యానల్‌కు నాయకత్వం వహించిన డాక్టర్ సుధీర్ గుప్తా, ఇది ఆత్మహత్య కేసు అని తేల్చేశారు. ఇందులో హత్య కోణం లేదని స్పష్టం చేశారు. "సుశాంత్ మరణం అనేది ఆత్మహత్య కేసు. హత్య అనే దాన్ని పూర్తిగా తోసిపుచ్చుతున్నాం" అని డాక్టర్ సుధీర్ గుప్తా చెప్పారు.
ఎయిమ్స్ వైద్యుల ప్యానెల్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్ట్ మార్టం, విసెరా నివేదికలను తమకు అందుబాటులో ఉన్న 20 శాతం విసెరా నమూనా ఆధారంగా తిరిగి అంచనా వేసింది. ల్యాప్‌టాప్, రెండు హార్డ్ డిస్క్‌లు, ఒక కానన్ కెమెరా, రెండు మొబైల్ ఫోన్‌లను ఫోరెన్సిక్ ఏజెన్సీలు పరిశీలించాయి.
ఎయిమ్స్ వైద్యులు తమ పరిశోధనలను సెప్టెంబర్ 29న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కు సమర్పించారు. ఎయిమ్స్ మెడికల్ బోర్డ్ ఫలితాలు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ శవపరీక్ష జరిగిన కూపర్ హాస్పిటల్ ఫలితాలతో సరిపోలాయి. అంతేకాకుండా, సందర్భానుసార సాక్ష్యాలు కూడా ఇది ఆత్మహత్యేయని సూచిస్తున్నాయనీ, ఇందులో ఎలాంటి మతలబు జరగలేదని అవి చెబుతున్నాయనీ ఎయిమ్స్ రిపోర్ట్ తెలిపింది.
![]() |
![]() |