![]() |
![]() |

తెలుగులో 'బిగ్ బాస్' రియాలిటీ షో మొదలైంది. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న హిందీ బిగ్ బాస్ సీజన్ 14 ఈ రోజు నుండి మొదలు కానుంది. సాధారణంగా 'బిగ్ బాస్' హౌస్‌లోకి 14 నుండి 16 మంది కంటెస్టెంట్లను పంపిస్తారు. కానీ, ఈ ఏడాది బాలీవుడ్ బిగ్ బాస్ లెక్క తగ్గిస్తున్నాడని టాక్. పదకొండు మందిని మాత్రమే హౌస్‌లోకి పంపిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది నిజమో కాదో శనివారం సాయంత్రానికి తెలుస్తుంది.
హిందీలో 'బిగ్ బాస్' షో కోసం మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్లను సెలెక్ట్ చేశారు. అందులో ముగ్గురు ఆల్రెడీ ఒకసారి హౌస్‌లోకి వెళ్లి వచ్చినవారే. 'శంకర్ దాదా' ఐటమ్ గాళ్ గౌహర్ ఖాన్, హీనా ఖాన్, సిద్ధార్ధ శుక్లా మళ్ళీ షోలో సందడి చేయనున్నారు. వాళ్ళు రెండు నుండి మూడు వారాలు హౌస్ లో ఉంటారట. ఓ వారం లేదా రెండు వారాల తరవాత మిగతా నలుగురిని లోపలికి పంపిస్తారట. తెలుగులో కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. అవినాష్, స్వాతి దీక్షిత్ లను తరవాత పంపారు.
![]() |
![]() |