![]() |
![]() |

ఆడిషన్స్ చేసి సినిమాకు అవసరమైన నటీనటులను ఎంపిక చేసే ట్రెండ్ ఎప్పటి నుండో ఉంది. కానీ ఓ బాలీవుడ్ నిర్మాత చేతి రేఖలు చూసి నటీనటులను ఎంపిక చేస్తాడట. ప్రముఖ హీరో మాధవన్ ఈ విషయం చెప్పారు. ఆయన నటించిన 'నిశ్శబ్దం' సినిమా గాంధీ జయంతి రోజున విడుదలైంది. విడుదల సందర్భంగా మీడియాతో ముచ్చటించిన మాధవన్ కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన వింత అనుభవాన్ని చెప్పుకొచ్చారు.
తెలుగు, తమిళ, హిందీ భాషలలో నటుడిగా మాధవన్ మంచి పేరు తెచ్చుకున్నారు. మొదటి సినిమా విడుదలైనప్పటి నుండి ఆయనకు క్రేజ్ ఏర్పడింది. అయితే అంతకుముందు మాధవన్ కూడా సినిమా ప్రొడ్యూసర్ ఆఫీసుల చుట్టూ తిరిగారు. ఆ సమయంలో ఓ బాలీవుడ్ నిర్మాత అతని చేతి రేఖలు చూసి సినిమా అవకాశం ఇవ్వలేదట.
"నాకు ఇప్పటికీ గుర్తుంది... ఓ సినిమా కాస్టింగ్ ప్రాసెస్ జరుగుతుంటే వెళ్లాను. ప్రొడ్యూసర్ నా చేతిని చూశాడు. 'ఓకే బేటా ఆల్ ది బెస్ట్' అని చెప్పాడు. నాకు ఆ సినిమా రాలేదు. 'నా చేతిని చూసి సినిమా ఇస్తారా? చేతి రేఖలు చూసి ఆ జ్యోతిష్యం బట్టే నేను నటించగలనో లేదో నిర్ణయిస్తారా?' అనుకున్నాను. అదే నిర్మాత పదేళ్ల తర్వాత నాతో సినిమా చేయాలని అనుకున్నారు" అని మాధవన్ తెలిపారు.
![]() |
![]() |