![]() |
![]() |

సుశాంత్ సూసైడ్ కేసులో తొలుత రియా చక్రవర్తి మీద అతని అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆమెను దోషిగా చూసిన వారి సంఖ్య ఎక్కువే. అయితే, పోను పోను రియాను ఈ కేసులో ఇరికించారని అభిప్రాయం కొందరిలో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మీడియా ఆమెను చుట్టుముట్టిన ఫొటోలు వైరల్ కావడంతో రియా చక్రవర్తి మీద సింపతి చూపించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పుడు ఆమె మీద బయోపిక్ తీయడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం.
సుశాంత్ మరణం తర్వాత అతడి జీవితంపై సినిమా తీస్తున్నట్లు కొంతమంది ప్రకటించారు. టైటిల్స్ కూడా చెప్పారు. రియా చక్రవర్తి బయోపిక్ తీస్తున్నట్లు ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదు. కనీసం ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా స్పందించలేదు. కానీ, కొంతమంది సన్నాహాల్లో ఉన్నారట. రియా జీవితంతో సహా సుశాంత్ పరిచయం, ప్రేమ, అతని మరణం తర్వాత ఆమె మానసిక వేదనను అందులో చూపించనున్నారట. ఒక పబ్లిషింగ్ హౌస్ అయితే ఆమె ఆటోబయోగ్రఫీ బుక్ రైట్స్ తీసుకోవడానికి కాంట్రాక్ట్ కుదుర్చుకోవాలని అనుకుంటున్నారట.
![]() |
![]() |