![]() |
![]() |

కంగనా రనౌత్ ఆఫీసు నిర్మాణం అక్రమమని ముంబై మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడం, తర్వాత కూల్చివేతకు పాల్పడడం ఆమెపై శివసేన పార్టీ తీసుకున్న ప్రతీకార చర్యలే అని కంగనా అభిమానులు అంటున్నారు. కంగనాను నేరుగా ఎదుర్కొనలేక ముంబై మున్సిపల్ అధికారులను శివసేన పార్టీ రంగంలోకి దించిందనే మాటలు కొందరి నోట వినిపిస్తున్నాయి. చట్ట ప్రకారం నడుచుకోకుండా అధికార పార్టీ చెప్పినట్లు చేశారని ముంబై మున్సిపల్ అధికారులు అప్రతిష్ఠ మూట కట్టుకున్నారు. ప్రస్తుతం అది తుడిచేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతుంది.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాకూ ముంబై మున్సిపల్ అధికారులు నోటీసు ఇచ్చారు. ఆయన పాలీ హిల్ హౌస్ అనధికారిక నిర్మాణం అని అందులో పేర్కొన్నారు. కంగనా రనౌత్ ఆఫీసు కూడా పాలీ హిల్స్ లో ఉంది. కేవలం కంగనారనౌత్ ఆఫీస్ మీదే కాకుండా ఇతర నిర్మాణాలపై కూడా దృష్టి పెడుతున్నామని చెప్పుకోవడానికి ముంబై మున్సిపల్ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు కనబడుతుందని జనాలు అంటున్నారు.
![]() |
![]() |