![]() |
![]() |

గత కొన్నేళ్లుగా దేశంలో చాలా మార్పులు జరిగాయి, భవిష్యత్తులోనూ చాలా జరుగుతాయి. కానీ ఓ విషయం మాత్రం ఎప్పటికీ మారదు.. అది రిపబ్లిక్ టీవీ అర్ణబ్ గోస్వామి విషయంలో కమెడియన్ కునాల్ కమ్రా సెంటిమెంట్లు! ఎప్పటికప్పుడు అతని చేష్టలు ఆ విషయాన్నే తెలియజేస్తుంటాయి. అర్ణబ్‌కు సంబంధించి అతడు చేసే ప్రతి పనీ చూడ్డానికి చాలా వినోదాన్నిస్తుందనేది నిజం.
తాజాగా అతను బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌ను వెంటబెట్టుకొని రిపబ్లిక్ టీవీ ఆఫీస్‌కు వెళ్లాడు.. దేనికో తెలుసా.. అర్ణబ్‌కు ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డ్ ఇవ్వడానికి! ఇది మంచి విషయమే కదా అనుకుంటున్నారా?.. ఆగండి.. వాళ్లు ఆ అవార్డును దేనితో ఇవ్వాలనుకున్నారో.. అక్కడే ఉంది అసలు విషయం. చెరొక ఫ్రేమ్ కట్టించిన స్లిప్పర్‌ను చేతుల్లో పట్టుకొని వెళ్లిన ఆ ఇద్దరినీ సహజంగానే రిపబ్లిక్ టీవీ ఆఫీస్ లోపలికి వెళ్లకుండా సెక్యూరిటీ ఆపేసింది.
ఈ విషయాన్ని కునాల్ క్రమా.. తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తే, దాన్ని అనురాగ్ కశ్యప్ రిట్వీట్ చేశాడు. ఇద్దరూ ఫ్రేమ్డ్ స్లిప్పర్లను చేతుల్లో పట్టుకొన్న పిక్చర్‌ను అందులో షేర్ చేశారు. దానిపై నెటిజన్లు బాగానే స్పందించారు. కొంతమంది పాజిటివ్‌గా, ఇంకొంతమంది నెగటివ్‌గా కామెంట్లు పెట్టారు.

సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విషయంలో బాలీవుడ్ సెలబ్రిటీలను టార్గెట్ చేసుకొని అర్ణబ్ గోస్వామి ఆవేశంగా ఊగిపోతూ చర్చలు నడుపుతున్న విషయం తెలిసిందే.
![]() |
![]() |