![]() |
![]() |

మహారాష్ట్రలోని అధికారి శివసేన పార్టీ, మహా ధైర్యవంతురాలు కంగనా రనౌత్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. అది మాటల రూపంలోనైనా... చేతల రూపంలోనైనా... కేసుల రూపంలోనైనా కావచ్చు.
ముంబైను పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో కంగనా రనౌత్ పోల్చడంతో ఆమెపై శివసేన పార్టీ నిప్పులు చెరుగుతోంది. ఆ పార్టీకి చెందిన రాజకీయ నేత సంజయ్ దత్ తీవ్ర పదజాలంతో విరుచుకు పడ్డారు. అనంతర పరిణామాల నేపథ్యంలో ముంబైలోని కంగనా ఆఫీసును మున్సిపల్ అధికారులు కూల్చివేసిన ఘటన తెలిసిందే. అంతకుముందే ఆమె వ్యాఖ్యలను దేశద్రోహంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కంగనా పై కొందరు శివ సైనికులు కేసులు పెట్టారు. తాజా కేసు వివరాల్లోకి వస్తే...
ఆఫీసు కూల్చి వేసిన తర్వాత కంగనా రనౌత్ ఒక వీడియో విడుదల చేశారు. అందులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై విరుచుకుపడ్డారు. ఆయన అహంకారం అణుగుతుందని అందులో వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి హెచ్చరికలు జారీ చేశారు. ఆయనను మూవీ మాఫియా ఫేవరెట్ సీఎం అని అభివర్ణించారు. తర్వాత చేసిన మరో ట్వీట్ లో "కరణ్ జోహార్ ఉద్ధవ్ ఠాక్రే పై నేను బ్రతికున్న మరణించిన మీ అసలు రంగు ప్రపంచానికి చూపిస్తాను" అని అర్థం వచ్చేలా మాట్లాడారు. ముఖ్యమంత్రిపై కంగనారనౌత్ చేసిన వ్యాఖ్యలకు గాను ఆమెపై కేసు రిజిస్టర్ చేశారని తెలుస్తోంది.
![]() |
![]() |