![]() |
![]() |

దర్శకుడు కొరటాల శివ తాను రాసిన 'ఆచార్య' కథపై ఎంత నమ్మకంగా ఉన్నాడనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. సాధారణంగా సినిమా విడుదలైన తర్వాత తమ కథను కాపీ చేసి తీశారనే కొందరు చేసే ఆరోపణలను వింటుంటాం. కానీ, 'ఆచార్య' ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత ఆ సినిమా కథ తనదేనని అంటూ రాజేష్ మండూరి అనే రచయిత మీడియాకి ఎక్కాడు.
తాను 'పెద్దాయన' అని ఒక కథ రాసుకున్నాననీ, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతలకు ఆ కథలో చెప్పాననీ, అదే కథను వాళ్లు కొరటాల చెప్పడంతో ఆయన కాపీ చేసి సినిమాను తీస్తున్నాడనీ రాజేష్ మండూరి ఆరోపించారు. 'ఆచార్య' నిర్మాణ సంస్థ మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ సహా మైత్రి మూవీ మేకర్స్ కూడా అతని ఆరోపణలను ఖండించాయి.
ఒక న్యూస్ ఛానల్ నిర్వహించిన లైవ్ లో రాజేష్ కొండూరితో కొరటాల మాట్లాడారు. తాను ఎవరి కథ కాపీ చేయలేదని అవసరమైతే కోర్టుకు వెళ్లవచ్చునని సూచించారు. తనపై ఆరోపణలు చేస్తున్న వాళ్ళ పై కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు కూడా. ఇప్పుడు కొరటాల అన్నంత పని చేశారు. తనపై ఆరోపణలు చేసిన రాజేష్ మండూరిపై పరువు నష్టం దావా కేసు వేశారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత నిరంజన్ రెడ్డి లాయర్ కావడంతో ఆయనే కేస్ వ్యవహారాలను దగ్గరుండి చూశారట. త్వరలో ఈ కేసు హియరింగ్ కి వస్తుందట.
![]() |
![]() |