![]() |
![]() |

మంగళవారం నటి రియా చక్రవర్తిని ఎన్‌సీబీ అరెస్ట్ చేయడంపై సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే సోషల్ మీడియా ద్వారా స్పందించింది. "జస్టిస్" అనే క్యాప్షన్‌తో ఓ నోట్‌ను ఆమె షేర్ చేసింది. అది రియాను ఉద్దేశంచి చేసిందేనని ఎవరికైనా సులువుగా అర్థమైపోతుంది. రియాను అరెస్ట్ చేయాలని సుశాంత్ కుటుంబం, స్నేహితులు మొదట్నుంచీ కోరుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో వారికి అంకిత మద్దతునిస్తూ వస్తోంది.
"ఏదీ అనుకోకుండా జరగదు. విధి వల్లే జరుగుతుంది. నీ చర్యల ద్వారానే నీ విధిని నువ్వు రాసుకున్నావు. అదే కర్మ" అని ఆ నోట్‌లో రాసింది అంకిత.

డ్రగ్స్ కొనుగోళ్లలో రియా పాత్రపై విచారణ జరుపుతున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మంగళవారం ఆమెను అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ (ఎన్‌డీపీఎస్) లోని సెక్షన్లు 89(సి), 20(బి), 27(ఎ), 28, 29 కింద ఆమెను ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది.
![]() |
![]() |