![]() |
![]() |

కరోనా భయాన్ని పక్కన పెట్టి నన్ను నటీనటులు దర్శకనిర్మాతలు షూటింగులు చేయడం ప్రారంభించారు. హైదరాబాదులో 'లవ్ స్టోరీ', 'సోలో బ్రతుకే సో బెటర్' షూటింగుల జరుగుతున్నాయి. ఇటీవలే 'గుడ్ లక్ సఖి' చిత్రీకరణను కీర్తి సురేష్ పూర్తి చేశారు. తమిళ సినిమా షూటింగులు కూడా మొదలయ్యాయి. క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ ఓ తమిళ సినిమా షూటింగ్ కోసం అని జైపూర్ వెళ్ళారు. అక్కడ SAMODE PALACE HOTEL లో బస చేస్తున్నారు. షార్ట్ బ్రేక్ మధ్యలో ఆమె కిచెన్ లోకి వెళ్లి కాసేపు గరిటె తిప్పారు.

క్యారెక్టర్ ఆర్టిస్టులు రోజంతా షూటింగ్ చేయరు కదా! కొన్ని సన్నివేశాలకు వాళ్ల అవసరం ఉండదు. అప్పుడు వాళ్లకు బ్రేక్ ఇస్తారు. మంగళవారం అలా బ్రేక్ వచ్చినప్పుడు సురేఖ హోటల్ కిచెన్ లోకి వెళ్ళి రసం వండారు. సురేఖ స్పెషల్ రసం... తమిళ సినిమా యూనిట్ కోసం మాత్రమే! ఆ రసం టెస్ట్ ఎలా ఉందో వాళ్లే చెప్పాలి మరి! ఎంతైనా యూనిట్ కోసం వంట చేయడం గ్రేట్ కదా.
![]() |
![]() |