![]() |
![]() |

కరోనా విజృంభణ ఎప్పుడు తగ్గుముఖం పడుతుందా? ఇళ్లలో కాకుండా ఎప్పుడు బయట ప్రపంచంలో హాయిగా విహరిద్దామా? అని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. వ్యాక్సిన్ వస్తే పార్టీలు చేసుకోవచ్చనీ, షికార్లకు వెళ్ళవచ్చనీ ఆలోచిస్తున్నారు. ఒకవేళ కరోనా తగ్గినా సరే తాను మాత్రం బయటకు వెళ్లానని శృతి హాసన్ చెబుతున్నారు.
"నేను హోమ్ బాడీని. ఇంట్లో ఉండటానికి ఇష్టపడతా. వరల్డ్ అంతా మళ్ళీ ఓపెన్ అయినా సరే నేను బయటకు వెళ్ళడాన్ని ఊహించుకోలేకపోతున్నాను. ఐ లవ్ మి. నాకు నేనంటే ఇష్టం" అని శృతి హాసన్ అన్నారు. ప్రజెంట్ చాలామంది మెసేజ్ చేయడాన్ని ఇష్టపడుతున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ తదితర సైట్లలో చాటింగ్ చేస్తున్నారు. తాను మెసేజ్ చేయడం కంటే ఫోన్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానని శృతి హాసన్ తెలిపారు.
ఈ వీకెండ్ ఏదో స్పెషల్ న్యూస్ చెబుతానని శృతి హాసన్ అంటున్నారు. కొత్త వెంచర్ కి సంబంధించి ఏదో ప్రకటన చేస్తారట. అది ఏమై ఉంటుందని ఆమె అభిమానులు అందరూ ఆలోచిస్తున్నారు.
![]() |
![]() |