![]() |
![]() |

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడటంతో ఆయన కుటుంబ సభ్యులంతా సెల్ఫ్ హోమ్ క్వారంటైన్‌కి వెళ్లారు. ఎస్పీబీకి మైల్డ్ కరోనా వచ్చింది. ఆయనలో కొవిడ్–19 వైరస్ లక్షణాలు స్వల్పంగా బయటపడ్డాయి. ఆయన నుండి ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరికైనా కాంటాక్ట్ అయ్యిందేమో అనే అనుమానంతో అందరూ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ప్రస్తుతం చెన్నైలో కరోనా ఉధృతి తగ్గలేదు. కేసులు బాగా ఉన్నాయి. అందుకని, అధికారులు సైతం ఎస్పీబీ ఫ్యామిలీని క్వారంటైన్ చేసినట్టు తెలుస్తోంది.
ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఆయన కుటుంబ సభ్యులు సైతం చేయించుకుంటున్నట్టు చెన్నై సమాచారం. ఎస్పీబీ సోదరి ఎస్పీ శైలజ సైతం కొవిడ్–19 టెస్ట్ చేయించుకున్నారు. ఫలితాలు రావాల్సి ఉంది. ఓ వైపు కరోనా బారిన పడి కోలుకుంటున్న ప్రజల సంఖ్య వందల్లో ఉన్నప్పటికీ, మరో వైపు మరణాలు కూడా చోటు చేసుకుంటుండంతో ప్రజల్లో కరోనా భయాలు పోవడం లేదు.
![]() |
![]() |