![]() |
![]() |

ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను అనుసరిస్తున్నవారి సంఖ్య 15 మిలియన్లకు చేరింది. అందులో ఆమె వెనుక కోటిన్నరమంది ఉన్నారన్నమాట! తన ఫాలోయర్ల సంఖ్య 15 మిలియన్లకు చేరిన సందర్భంగా రకుల్ సంతోషం వ్యక్తం చేశారు.
రకుల్‌తో పోలిస్తే... ఇన్‌స్టాగ్రామ్‌లో మిగతా తెలుగు స్టార్ హీరోయిన్లకు ఫాలోయింగ్ తక్కువే. కాజల్ అగర్వాల్‌కి 14.8 మిలియన్స్, శృతీ హాసన్‌కి 14.4 మిలియన్స్, పూజా హెగ్డేకి 11.2 మిలియన్స్, సమంతకి 11.1 మిలియన్స్, రష్మికా మందన్నాకు 7.9 మిలియన్స్, కీర్తీ సురేష్‌కు 5.8 మిలియన్స్, నిధీ అగర్వాల్‌కు 5.3 మిలియన్స్, రాశీ ఖన్నాకు 5.2 మిలియన్స్, సాయి పల్లవికి 2.2 మిలియన్స్, నభా నటేష్‌కు 1.9 మిలియన్స్ ఫాలోయర్లు ఉన్నారు.
తెలుగులో పవన్ కల్యాణ్, ప్రభాస్ మినహా మిగతా స్టార్ హీరోలు మహేష్‌బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, రవితేజ సరసన హీరోయిన్‌గా రకుల్ నటించారు. యంగ్ హీరోలు రామ్, సందీప్ కిషన్, మంచు మనోజ్‌తో ఆమె సినిమాలు చేశారు. తమిళంలో సూర్య, కార్తీ సరసన, హిందీలో అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రాతో సినిమాలు చేశారు. అందుకని, ఇన్‌స్టాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉండి ఉండవచ్చు.
![]() |
![]() |