![]() |
![]() |

షూటింగ్‌లకు పరిస్థితులు సానుకూలంగా మారగానే సూపర్‌స్టార్ మహేశ్ 'సర్కారు వారి పాట' సెట్స్‌పైకి వెళ్లనున్నాడు. ఈ మూవీని పరశురామ్ డైరెక్ట్ చేయనున్నాడు. దీని తర్వాత యస్.యస్. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ నటించనున్నట్లు వార్తలు వస్తున్న విషయం మనం గమనిస్తున్నాం. అయితే ఆ సినిమా స్క్రిప్ట్ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. పైగా అది సెట్స్ మీదకు వెళ్లడానికి చాలా సమయం పడుతుందని కూడా వినిపిస్తోంది.
ఈలోగా మరో డైరెక్టర్‌కి మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారంలోకి వచ్చింది. అతను మరెవరో కాదు.. కార్తీకి 'ఖైదీ' లాంటి మెమరబుల్ హిట్‌ను అందించిన తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఇప్పటికే అతనితో ఓ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం కోసం టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అన్నీ అనుకూలిస్తే మహేశ్, కనగరాజ్ కాంబినేషన్ వర్కవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లోకేశ్ ప్రస్తుతం విజయ్ హీరోగా చేసిన 'మాస్టర్' మూవీ పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్నాడు. థియేటర్లు తెరుచుకోగానే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.
![]() |
![]() |