![]() |
![]() |

భారతీయ సినిమాలో నెపోటిజం అనే అంశంపై చర్చ ఇప్పట్లో ఆగేట్లు కనిపించడం లేదు. కమల్ హాసన్, సారిక దంపతుల పెద్ద కూతురు శ్రుతి హాసన్ కూడా దానిపై గళమెత్తింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో తను ఈజీగానే అడుగు పెట్టిందనీ, కానీ కొనసాగడానికి మాత్రం చాలా కష్టపడుతూ వస్తున్నానని తెలిపింది.
"నేను పెరుగుతూ వచ్చిన వ్యక్తుల కారణంగా, నా పేరెంట్స్ కారణంగా సినిమా తలుపులు నాకు సునాయాసంగానే తెరుచుకున్నాయి. నా ఇంటిపేరు వల్ల అది సాధ్యమయ్యిందనేది నిజం. కానీ జనరల్‌గా లైఫ్‌లో నేను నెమ్మదిగా నేర్చుకునే మనిషిని. సరైన విధంగా కమ్యూనికేట్ చేయడం నాకు తెలీదు. సరైన వ్యక్తుల్ని ఎలా కలవాలో నాకు తెలీదు. నిజానికి ఇప్పటికీ సోషల్‌గా నేను ఇబ్బందిపడుతూనే ఉంటాను. కాబట్టి నేవిగేట్ చేయడం నాకంత ఈజీ కాదు. ఒక విషయం చెప్పగలను.. అడుగుపెట్టడం ఈజీయే కానీ, నిలదొక్కుకోవడం కష్టం" అని చెప్పుకొచ్చింది శ్రుతి.
తిగమాన్షు ధూలియా డైరెక్షన్‌లో ఆమె నటించిన బాలీవుడ్ మూవీ 'యారా' త్వరలో ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. తెలుగులో 'వకీల్ సాబ్' మూవీలో పవన్ కల్యాణ్ భార్య పాత్రలో నటించనున్నానని ఇటీవలే ఆమె వెల్లడించింది.
![]() |
![]() |