![]() |
![]() |

బాలీవుడ్ ప్రొడ్యూసర్, దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ 'నేర్కొండ పార్వై' సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెట్టారు. హిందీ హిట్ ఫిల్మ్ 'పింక్'కు రీమేక్ అయిన ఆ మూవీలో లాయర్‌గా అజిత్ ప్రధాన పాత్ర పోషించాడు. 'నేర్కొండ పార్వై' బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. దాని తర్వాత మరో మూవీని కూడా అజిత్‌తో నిర్మించేందుకు బోనీ సన్నాహాలు చేస్తున్నారు. 'వాలిమై' పేరుతో తయారయ్యే ఆ మూవీని సైతం 'నేర్కొండ పార్వై' డైరెక్టర్ హెచ్. వినోద్ డైరెక్ట్ చేయనున్నాడు.
శ్రీదేవి ప్రధాన పాత్ర చేసిన 'ఇంగ్లీష్ వింగ్లీష్'లో అజిత్ ఓ ప్రత్యేక పాత్ర పోషించాడు. అప్పట్నుంచీ అజిత్, బోనీ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పుడు అజిత్ సూపర్ హిట్ తమిళ చిత్రాలను బాలీవుడ్లో రీమేక్ చేయాలని బోనీ భావిస్తున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఆయన 'వాలి', 'వరలారు' సినిమాల రీమేక్ హక్కులను పొందినట్లు సమాచారం. మొదట 'వాలి' మూవీని తన కుమారుడు అర్జున్ కపూర్‌తో తీయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నాడట. 'వాలి'లో కవల సోదరులుగా అజిత్ అద్వితీయ నట విన్యాసం ప్రదర్శించాడు. వారిలో ఒకరు విలన్ కావడం ప్రధానాకర్షణ.
![]() |
![]() |