![]() |
![]() |
.jpg)
సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కేసులో కరణ్ జోహార్ మేనేజర్‌కు ముంబై పోలీసులు సమన్లు పంపినట్లు, ఆమె స్టేట్‌మెంట్‌ను వాళ్లు రికార్డ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే కరణ్ జోహార్ మేనేజర్ రేష్మా శెట్టికి కాకుండా, కరణ్ నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ సీఈఓ అపూర్వ మెహతాకు ఆ సమన్లు వెళ్లినట్లు వెల్లడైంది.
ఈ రోజు మధ్యాహ్నం మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ, "ఒకట్రెండు రోజుల్లో మహేశ్ భట్ స్టేట్‌మెంట్ తీసుకుంటాం. ఆ తర్వాత సీఆర్‌పీసీ కింద కంగనా రనౌత్‌కు కూడా సమన్లు పంపిస్తాం. ఎవరికైతే అవసరమో వాళ్లకు సమన్లు పంపిస్తాం" అని చెప్పారు. "కరణ్ జోహార్‌కు కూడా సమన్లు పంపిస్తారా?" అనే ప్రశ్నకు, "కరణ్ జోహార్ మేనేజర్‌కు సమన్లు పంపించాం, అవసరమైతే కరణ్ జోహార్‌కూ సమన్లు పంపిస్తాం" అని ఆయన చెప్పారు. నిజానికి కరణ్ మేనేజర్ రేష్మా శెట్టి స్టేట్‌మెంట్‌ను జూలై 11నే పోలీసులు రికార్డ్ చేశారు.
బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి బయటవాళ్లు రాకుండా నిరోధించడానికి ఏ గ్రూప్ అయినా పనిచేస్తుందా అనే కోణంలో పోలీసులు అపూర్వ మెహతాను విచారించనున్నారు. సుశాంత్ సింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ పరిశోధన చేస్తున్నారు. వృత్తిపరమైన శత్రుత్వం, బిజినెస్ యాంగిల్ వంటివి కూడా వాటిలో ఉన్నాయి.
![]() |
![]() |