![]() |
![]() |
.jpg)
యువ కథానాయకుడు నితిన్, 'మహానటి' కీర్తి సురేశ్ తొలి కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'రంగ్ దే'. 'తొలిప్రేమ', 'మిస్టర్ మజ్ను' వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి. ప్రసాద్ చిత్ర సమర్పకులు.
ఈ రోజు రాత్రి నితిన్ తన చిరకాల స్నేహితురాలు శాలినిని పెళ్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నితిన్ మ్యారేజ్ గిఫ్ట్‌గా 'రంగ్ దే' దృశ్యమాలికను చిత్ర బృందం అందిస్తోంది.
" పెళ్లికొడుకెక్కడ..."
"హి ఈజ్ మై బాయ్ ఫ్రెండ్ .."
"అది నా గర్ల్ ఫ్రెండ్ కాదు.."
"అర్జున్.. ఇప్పుడున్న పరిస్థితిలో మీ ఇద్దరి ఫ్యూచర్ దృష్ట్యా 'అను' ని నువ్వు పెళ్లి చేసుకోవటమే నాకు న్యాయం అనిపిస్తోంది."
"చెయ్ తియ్ జస్టిస్ చౌదరి..."
"ఏంటి మావయ్య.. నీ బతుకు ఇలా అయిపొయింది..."
"ఏరా... ఏడుస్తున్నావా.... మరి పెట్టు.."
"నాన్నా.. నవ్వుతోంది ... నేను కట్టలేను నాన్నా'"
అంటూ సందర్భానుసారంగా సాగే సంభాషణలతో పాటు "బస్టాండే బస్టాండే... ఇక బతుకే బస్టాండే" అనే సాహిత్యంతో కూడిన బీజియంతో ఈ దృశ్య మాలిక ముగుస్తుంది.
ప్రేమ నేపథ్యంలో నడిచే కుటుంబ కథా చిత్రం 'రంగ్ దే'. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి. శ్రీరామ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణ బాధ్యతలను నిర్వర్తిస్తుండగా, దేవి శ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 2021 సంక్రాంతి కానుకగా చిత్రం విడుదల అవుతుందన్నట్లుగా ఈ టీజర్ లో కనిపిస్తుంది..
ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.

![]() |
![]() |