Home  »  News  »  అబ్బ‌.. ఆశ‌.. దోశ‌.. నా వెనుక వైఎస్సార్‌సీపీ ఉంటే చెప్తానా?

Updated : Jul 23, 2020

 

'పవర్ స్టార్' పూర్తిగా ఫిక్షనల్ కథతో తెరకెక్కిందని రామ్ గోపాల్ వర్మ మరోసారి స్పష్టం చేశారు. బుధవారం రాత్రి న్యూస్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన ఆయన, అది పవన్ క‌ల్యాణ్ కథ కాదని పునరుద్ఘాటించారు. కంప్లీట్ ఫిక్షన్ అన్నారు. తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోనని ఆయన అన్నారు.

'పవర్ స్టార్' ట్రయిలర్ విడుదలైన తరవాత వర్మ పేరు ప్రస్తావించకుండా కుక్కతో పోల్చిన నిఖిల్ ఎవరో తనకు తెలియదని ఆర్జీవీ అన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా తన వెనుక వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఉందని వచ్చిన విమర్శలకు తనదైన శైలిలో వర్మ సమాధానం ఇచ్చారు.

"ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పవన్ కళ్యాణ్, జనసేన అంటే గిట్టని పార్టీలు ఒకటో, రెండో ఉన్నాయి. బేసిక్‌గా వైఎస్ఆర్‌సీపీకి పవన్ అంటే పడదు. పైగా, బీజీపీతో పవన్ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'పవర్ స్టార్' సినిమా వెనుక, మీ వెనుక వైఎస్ఆర్‌సీపీ ఉందని బలమైన ప్ర‌చారం వస్తోంది. మీరేమంటారు?' అని చాన‌ల్ యాంకర్ ఆయ‌న‌ను ప్రశ్నించారు.

''ఇప్పుడు ఉన్నారనుకుందాం. నేను చెప్తానా? చెప్పను. అప్పుడు ప్రశ్నకు అర్థం ఏముంది?'' అని రామ్ గోపాల్ వర్మ సమాధానం ఇచ్చారు. "చెప్పకపోతే దాగుతుందా?" అని మళ్ళీ ప్రశ్నించగా... ''అది బయటకి వచ్చినప్పుడు చూద్దాం. ఒకవేళ ఉంటే... నాకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పను. నేను ఏం చెప్పినా మీరు నమ్మేది మీరు నమ్ముతారు. అటువంటి అప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను 'కాదు' అంటాను. మీరు 'అవును' అనుకుంటారు'' అని వర్మ అన్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.