![]() |
![]() |

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్.కార్తికేయ నిర్మాణంలో ప్రారంభమైన సినిమా 'ఆకాశవాణి'. అయితే, దర్శకుడు అశ్విన్ గంగరాజుతో ఆయనకు మనస్పర్థలు ఏర్పడటంతో సినిమా ప్రొడక్షన్ నుండి తప్పుకున్నారు. తరవాత వేరే నిర్మాత చేతుల్లోకి సినిమా వెళ్ళింది. ఇవన్నీ పక్కన పెడితే... లాక్ డౌన్ ఎఫెక్ట్ ఈ సినిమా మీద కూడా పడింది.
రాజమండ్రిలో ఏడు రోజులు షూటింగ్ చేస్తే సినిమా కంప్లీట్ అయ్యేది. ఈలోపు లాక్ డౌన్ వచ్చింది. దాంతో షూటింగ్ ఆగింది. ఇప్పుడు మళ్ళీ షూటింగ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే, రాజమండ్రిలో కాకుండా హైదరాబాద్ నగర శివార్లలో షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
'ఆకాశవాణి' లాస్ట్ షెడ్యూల్ రాజమండ్రి నుండి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యింది. రాజమండ్రి టైపులో లొకేషన్స్ ను హైదరాబాద్ శివార్లలో కనుకొన్నారట. నెక్స్ట్ వీక్ షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తరవాత రెండు రోజులు పాడేరులో షూటింగ్ చేస్తారట. తరవాత 45 రోజులకు ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని సమాచారం. ఈ సినిమాను ఎ. పద్మనాభరెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు.
![]() |
![]() |