![]() |
![]() |

బాలీవుడ్‌లో నెపోటిజమ్ గురించి హీరోయిన్ రిచా చద్దా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరవాత మొదలైన నెపోటిజమ్ డిస్కషన్ ఇంకా ఆగలేదు. అతడు మరణించిన నెల రోజుల తరవాత కూడా ఎవరో ఒకరు నెపోటిజమ్ ఎలా ఉంటుందో వివరిస్తూ ఉన్నారు. సుశాంత్ మరణించి నెల రోజులైన సందర్భంగా కొంతమంది దర్శకులు సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేశారు. సదరు దర్శకులపై రిచా చద్దా నిప్పులు చెరిగారు.
"సంతాపాలు ప్రకటించిన దర్శకులు, తమ గదికి రాలేదని కొంతమంది హీరోయిన్లను తమ సినిమాల నుండి తీసేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొంతమంది దర్శకులు హీరోయిన్లను చులకనగా చూస్తారు. వాళ్ళు ఈ రోజు సంతాపాలు ప్రకటించారు" అని రిచా చద్దా పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీ జాలి ఉన్నవాళ్లు, జాలి లేని వాళ్ళు మాత్రమే ఉంటారని ఆమె అన్నారు.
హీరోయిన్లను దర్శకులు తమ గదికి ఎందుకు పిలుస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా! 'మీ టూ' మూమెంట్ సమయంలోనూ కొంతమంది హీరోయిన్లు తమకు ఎదురైనా లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చారు.
![]() |
![]() |