![]() |
![]() |

షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఎప్పుడు షూటింగ్ మొదలైనా అప్పటికి స్ర్కిప్ట్ వర్క్, కాస్ట్ అండ్ క్రూ సెలక్షన్ కంప్లీట్ చేసి సెట్స్‌లో ‘రెడీ... కెమెరా... స్టార్ట్... యాక్షన్’ అని చెప్పడానికి రెడీగా ఉండాలని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్లాన్ అట. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఆయన ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రజెంట్ బాహుబలి హీరో నటిస్తున్న ‘రాధే శ్యామ్’ కంప్లీట్ అయిన తరవాత సెట్స్ మీదకు ఆ సినిమా వెళ్లనుంది.
ప్రజెంట్ ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్. ‘బాహుబలి’ రెండు పార్ట్స్, ‘సాహో’ తరవాత అతడి ఇమేజ్ పెరిగింది. ప్రభాస్‌తో సినిమాలు చేసే డైరెక్టర్స్ అందుకు తగ్గట్టు పాన్–ఇండియన్ లెవల్లో స్ర్కిప్ట్స్ ప్లాన్ చేస్తున్నారు. నాగ్ ఆశ్విన్ తనది పాన్ ఇండియన్ కాదనీ, పాన్ వరల్డ్ అని ఆడియన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెంచాడు. ఈ సినిమాలో దీపికా పదుకొనే, కత్రీనా కైఫ్ తదితరుల పేర్లు హీరోయిన్ రేసులో వినిపించాయి. ఇప్పుడు వాళ్ళను కాదని మహేశ్‌బాబు ‘భరత్ అనే నేను’లో నటించిన కియారా అద్వానీని తీసుకోవాలని అనుకుంటున్నారట. ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’లో కియారా అద్వానీ యాక్టింగ్ నచ్చి ఆమెను ఎంపిక చేశారట.
![]() |
![]() |