![]() |
![]() |

కాజల్ అగర్వాల్, నయనతార, అనుష్క... ఇప్పటివరకు ముగ్గురి పేర్లు వినిపించాయి. గోపీచంద్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'అలిమేలు మంగ వెంకటరమణ'లో కథానాయికగా ముగ్గురిలో ఎవరో ఒకరిని ఎంపిక చేయవచ్చని వినిపించింది. ఇప్పుడు కొత్తగా నాలుగో పేరు వచ్చి చేరింది. 'మహానటి' ఫేమ్ కీర్తి పేరు పరిశీలనలో ఉందట. గోపీచంద్ సరసన కథానాయికగా కీర్తీ సురేష్ అయితే ఎలా ఉంటుందని దర్శకుడు తేజ ఆలోచిస్తున్నారట. ఇటీవల ఆమెకు కథ వినిపించగా నచ్చిందని చెప్పారట. అలిమేలు క్యారెక్టర్ చేయడానికి ఎగ్జయిటెడ్ గా ఉన్నారట.
ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ చేయాలనేది గోపీచంద్, తేజ ప్లాన్. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ అంతా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు. అందుకని, బల్క్ డేట్స్ అడ్జస్ట్ చేయగల హీరోయిన్ కోసం టార్చ్ లైట్ వేసుకుని మరీ సెర్చ్ చేస్తున్నారు. అందుకని, పలువురు హీరోయిన్లను ఆప్షన్ లో ఉంచుతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి.
![]() |
![]() |