![]() |
![]() |

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ సినిమా 'వకీల్ సాబ్'కి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. వీలైనంత త్వరగా సినిమా కంప్లీట్ చేసి 2020 సమ్మర్‌కి సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే, కరోనా రూపంలో పెద్ద సమస్య వచ్చి పడింది. షూటింగ్ చేయలేని సిట్యువేషన్. ఇప్పుడీ సినిమాకు మరో ప్రాబ్లమ్ వచ్చింది. లాయర్ గెటప్‌లో పవన్ కల్యాణ్ లుక్ లీకైంది.
'వకీల్ సాబ్'లో పవన్ కల్యాణ్ లుక్‌ను ఆల్రెడీ రిలీజ్ చేశారు. ట్రాలీ ట్రక్‌లో కుర్చీని కాలితో తన్నుతున్న హీరో స్టిల్, అభిమానులను ఆకట్టుకుంది. అయితే, లాయర్ గెటప్‌లో హీరో లుక్ రిలీజ్ చేయలేదు. ఆడియన్స్‌కి కొన్ని రోజుల తరవాత సర్‌ప్రైజ్ ఇవ్వాలని దాచి పెట్టారు. ఎవరో దాన్ని లీక్ చేశారు. వీఎఫ్ఎక్స్ చేయడం కోసం కొంత ఫుటేజ్ పంపిస్తే అక్కడి నుండి లీక్ అయ్యి ఉండవచ్చని యూనిట్ భావిస్తోంది. ఈ స్టిల్ లో పవన్ వెనుక అంజలి కూర్చుని ఉంది. సినిమాలో ఆమె మెయిన్ రోల్ చేస్తోంది. ఆల్రెడీ సినిమా స్టోరీ చాలామందికి తెలుసు.
పవన్ కల్యాణ్ రీమేక్ చేస్తున్నాడని హిందీ సినిమా 'పింక్'ను కొందరు చూశారు. తమిళంలో అజిత్ హీరోగా చేసిన రీమేక్ మరికొందరు చూశారు. తెలుగులో తగ్గట్టు మార్పులు చేసినా... బేసిక్ స్టోరీ లైన్ ఐడియా వచ్చింది. సినిమాలో కోర్ట్ సీన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కోర్టులో స్టిల్ లీక్ అయింది. డైరెక్టర్ వేణు శ్రీరామ్, ప్రొడ్యూసర్ దిల్ రాజు జాగ్రత్తలు తీసుకోవాలి మరి.
![]() |
![]() |