![]() |
![]() |

ఇదివరకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన నటి పూనమ్ కౌర్.. ఇప్పుడు కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ 'పవర్ స్టార్' మూవీ అనౌన్స్‌మెంట్‌ను హర్షించలేకపోయారు. చిన్నప్పుడు ఆర్జీవిని గౌరవించే తాను, ఇప్పుడు ఆయనను చూసి బాధపడుతున్నానని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆర్జీవీ 'పవర్ స్టార్' ట్వీట్‌ను ట్యాగ్ చేసిన ఆమె అమ్మాయిల విషయంలో ఆర్జీవీ ధోరణి ఎలా ఉంటుందో కూడా తెలియజేశారు.
"అమ్మాయిల మానసిక బలహీనతలను కనిపెట్టి, అసభ్యకరమైన భాషను వాడమని వాళ్లను ప్రేరేపించి, వాటిని షేర్ చెయ్యమని ట్వీట్స్ పెట్టి, ఆ తర్వాత దానిపై మీడియాకు సమాచారమిచ్చే ఆర్జీవీ అనే క్యారెక్టర్‌ను దయచేసి జోడించండి. చిన్నతనంలో మిమ్మల్ని గౌరవించేదాన్ని.. ఇప్పుడు మిమ్మల్ని చూసి బాధపడుతున్నాను" అని ఆమె తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
ఆ వెంటనే ఆమె చేసిన మరో ట్వీట్ అందరి కళ్లూ పెద్దవయ్యేలా చేశాయి. ఆర్జీవీని ఆమె విశ్వాసఘాతక దర్శకునిగా లేదూ దర్శక ద్రోహిగా అభివర్ణించారు. "ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడమని ఈ దర్శక ద్రోహి నన్ను ఓ గంటసేపు బ్రెయిన్‌వాస్ చేసిన కాల్‌ను రికార్డ్ చేశాను. అతను నాకు పంపిన ట్వీట్స్‌ను ఆ గౌరవ పార్టీ వ్యక్తికి పంపాను. మీడియాలో నాకు తెలిసిన కొంతమంది నిజాయితీపరులైన వాళ్లు ఉన్నందుకు దేవుడికి థాంక్స్ చెప్పుకుంటున్నా. లేకపోతే మీ ఉద్దేశాలు నాకు తెలిసేవి కావు" అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఆ ట్వీట్స్ ఎవరికి పంపిందో కూడా ఆమె తర్వాత తెలియజేశారు. జనసేన పార్టీ మీడియా హెడ్ అయిన హరిప్రసాద్‌కు వాటిని పంపినట్లు ఆమె చెప్పారు. మొత్తానికి ఆర్జీవీలోని మరో కోణాన్ని పూనమ్ కౌర్ బయటపెట్టారన్న మాట. ఇదివరకు పవన్ కల్యాణ్ గురించి తప్పుగా మాట్లాడినందుకు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నట్లు ఆమె తాజా ట్వీట్స్ తెలియజేస్తున్నాయి.



![]() |
![]() |