![]() |
![]() |

స్టార్ హీరోలు షూటింగ్స్ చేయడానికి రెడీగా లేరని టాలీవుడ్ సర్కిల్స్‌లో మాటలు షికార్లు చేస్తున్నాయి. ఈ ఏడాది అగ్ర హీరోలు ఎవరూ సెట్స్‌కి వచ్చే అవకాశాలు లేవని, వచ్చే ఏడాది షూటింగ్స్ స్టార్ట్ కావొచ్చునని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఆగస్టు నుండి సెట్స్‌కి రావడానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెడీ అవుతున్నాడని యువి క్రియేషన్స్ యూనిట్ వర్గాలు చెబుతున్నాయ్.
ప్రభాస్ హీరోగా 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో యువి క్రియేషన్స్, గోపికృష్ణా మూవీస్ ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం హైద్రాబాదులో హాస్పటల్, యూరోప్ స్ట్రీట్, భారీ షిప్ సెట్ వేస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ సెట్స్ కోసం సుమారు పది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ కంప్లీట్ కావడానికి నెల రోజులు పడుతుందని తెలిసింది. సెట్ వర్క్ కంప్లీట్ అయ్యాక షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్రభాస్ రెడీ అని చెప్పాడట. ఆగస్టు నుండి సెట్స్ మీదకు వెళ్లడానికి యూనిట్ రెడీ అవుతోంది.
![]() |
![]() |