![]() |
![]() |

గార్డెనింగ్ కాకుండా ఈ రోజుల్లో తాను ఎంజాయ్ చేస్తున్న ది మరొకటి ఏదైనా ఉందంటే అది యోగానే అని స్టార్ హీరోయిన్ సమంత చెప్పారు. లాక్ డౌన్ లో దొరికిన ఈ ఖాళీ సమయాన్ని టెర్రస్ మీద ఆకుకూరలు, కాయగూరలు సాగు చేస్తూ చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. టెర్రస్ గార్డెనింగ్ తో పాటు ఆమె ఇటీవల యోగా చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఈషా ప్రక్రియను ఆమె ప్రాక్టీస్ చేస్తున్నారు.

సమంత ఒక్కరే యోగా చేయడం లేదు. భర్త అక్కినేని నాగ చైతన్య తో కలసి చేస్తున్నారు. చైతూతో ను కలిసి చేస్తుండడం వల్ల యోగాను బాగా ఎంజాయ్ చేస్తున్నానని సమంత చెప్పారు. యోగ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఆ ఫోటోల్లో చైతన్య లేరు.
సమంత సన్నిహితురాలు శిల్పా రెడ్డికి కరోనా వచ్చిన నేపథ్యంలో తమ అభిమాన కథానాయికకు ఏమైందోనని ఆమె అభిమానులు ఆందోళన చెందారు. అయితే, ఆమెకు ఏమీ కాలేదని చెబుతున్నారు. చైతన్య సమంత దంపతులు ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం.
![]() |
![]() |