![]() |
![]() |

కరోనా మహమ్మారి ప్రపంచం ముందరి కాళ్లకు బంధం వేయకపోతే... నితిన్ బ్యాచిలర్ జీవితానికి ఎండ్ కార్డు పడి ఇప్పటికి రెండు నెలలు దాటేది. దుబాయ్‌లో ఏప్రిల్ 15న పెళ్లి చేసుకోవాలని నితిన్, షాలిని అనుకున్నారు. తామొకటి తలిస్తే విధి మరొకటి తలచిందన్నట్టు... కరోనా అడ్డు పడటంతో పెళ్లిని వాయిదా వేశారు. ఇప్పుడు కొత్త ముహూర్తం కోసం చూస్తున్నారు.
ప్రస్తుతం ఆషాఢమాసం నడుస్తోంది. జూలై 20 వరకూ ఉంటుంది. ఆ తర్వాత మంచి ముహూర్తం చూసి పెళ్లి చేయాలని ఇరువురి పెద్దలు భావిస్తున్నారు. బహుశా... జూలై నెలాఖరున లేదా ఆగస్టులో మంచి ముహూర్తం చూసి పెళ్లి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తెలిపారు.
ఒకవేళ పెళ్లి ఆలస్యమైతే సినిమా షూటింగులు స్టార్ట్ చేయాలని నితిన్ భావించినట్టు సమాచారం. ఆయన చేతిలో సెట్స్ మీద ఉన్న సినిమాలు రెండు, సెట్స్ మీదకు వెళ్లడానికి ఎదురు చూస్తున్న సినిమా ఒకటి ఉన్నాయి.
![]() |
![]() |