![]() |
![]() |

టాలెంటెడ్ తెలుగు ఆర్టిస్టులలో నవీన్ చంద్ర ఒకడు. విలన్స్ అంటే ముంబై నుంచి దిగుమతి చేసుకోవాలని ఒక స్థిర అభిప్రాయానికి వచ్చేసిన తెలుగు సినిమా దర్శక, నిర్మాతలకు నవీన్ చంద్రలో మంచి విలన్ ఉన్నాడని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చూపించాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలో నవీన్ చంద్ర విలనిజానికి మంచి మార్కులు పడ్డాయి. మెయిన్ విలన్ జగపతి బాబు కుమారుడిగా తనదైన శైలి నటనతో ఆకట్టుకున్నాడు.
'నేను లోకల్', 'ఎవరు' సినిమాల్లోనూ నవీన్ చంద్ర మంచి నటన కనబరిచాడు. అయితే, 'అరవింద సమేత...' కారణంగా రీల్ లైఫ్ లో ఎన్టీఆర్ విలన్ అయ్యాడు.
అబ్బాయి ఎన్టీఆర్ తో నటించిన నవీన్ చంద్రకు బాబాయ్ బాలకృష్ణతో నటించే అవకాశం లభించిందని సమాచారం. బాలకృష్ణతో 'సింహా', 'లెజెండ్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన దర్శకుడు బోయపాటి శ్రీను. హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో మూడో సినిమా టీజర్ ఇటీవలే విడుదలై ప్రేక్షకుల అమితంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో విలన్ పాత్ర ను నవీన్ చంద్రకు ఆఫర్ చేశారని ఫిలింనగర్ గుసగుస.
![]() |
![]() |