![]() |
![]() |

మరి కొద్ది గంటల్లో థియేటర్లలో అడుగుపెట్టనున్న పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమాకి ఊహించని షాక్ తగిలింది. తెలంగాణలో ఓజీ టికెట్ ధరల పెంపు మెమోని హైకోర్టు సస్పెండ్ చేసింది. (They Call Him OG)
ఓజీ సినిమా సెప్టెంబర్ 25న విడుదలవుతుండగా.. సెప్టెంబర్ 24 రాత్రి ప్రీమియర్లు వేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి ఒక్కో టికెట్ ధరను రూ.800గా నిర్ణయించారు. అలాగే, సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు పది రోజుల పాటు టికెట్ ధరలు పెంపుకి కూడా పర్మిషన్ ఇచ్చింది. ప్రస్తుత టికెట్ ధరలకు అదనంగా సింగిల్ స్క్రీన్స్ లో రూ.100, మల్టీప్లెక్స్ లలో రూ.150 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. అయితే దీనిని సవాల్ చేస్తూ.. మహేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. వాదనలు విన్న హైకోర్టు.. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను అక్టోబర్ 9 కి వాయిదా వేశారు.
Also Read: ఓజీలో పవన్ తో పాటు మరో ఇద్దరు స్టార్స్!
అయితే ఇప్పటికే తెలంగాణలో ప్రీమియర్ షోలతో పాటు, ఫస్ట్ వీకెండ్ కి భారీగా టికెట్స్ బుక్ అయ్యాయి. మరి ప్రీమియర్ షోలను రద్దు చేస్తారా? లేక టికెట్ ధరలను తగ్గించి, మిగిలిన మొత్తాన్ని రిఫండ్ చేస్తారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ లా మారింది.
![]() |
![]() |