![]() |
![]() |

నాచురల్ స్టార్ నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన హాయ్ నాన్న మూవీ ఈ రోజు రిలీజ్ అయ్యింది. నాని సినీ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ విడుదలైన అన్ని చోట్ల కూడా ప్యూర్ పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది.ఇప్పుడు ఈ హాయ్ నాన్న గురించి ఒక ప్రముఖ నిర్మాత తన ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఎన్నో మంచి చిత్రాలని ప్రేక్షకులకి అందించారు. తాజాగా ఆయన తన ట్విటర్ లో హాయ్ నాన్న చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో నాని చాలా ఛార్మింగ్ గా కనిపిస్తున్నాడు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గార్జియస్ గా కనిపిస్తుంది. ఆ ఇద్దరి పెయిర్ చాలా ఫ్రెష్ గా ఉండటంతో పాటు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా ఆకట్టుకుంది.అలాగే హేషం అబ్ధుల్ వహబ్ పాటలు, బేబీ కియారా క్యూట్ నెస్ కూడా నన్ను అరెస్ట్ చేశాయి అని చెప్పాడు. ఇప్పుడు నాగ వంశీ చేసిన పోస్ట్ ని చూసిన చాలా మంది నిన్న వేసిన హాయ్ నాన్న ప్రీమియర్ షో చూసుంటాడని అంటున్నారు.
అలాగే మూవీ విడుదల సందర్భంగా డైరెక్టర్ శౌర్యువ్ తో పాటు చిత్ర నిర్మాతలకి అలాగే హాయ్ నాన్న టీమ్ మొత్తానికి నాగ వంశీ బెస్ట్ విషెస్ చెప్పాడు. నాగవంశీ లేటెస్ట్ గా వైష్ణవ్ తేజ్ తో ఆదికేశవ సినిమాని నిర్మించాడు.కొన్ని రోజుల క్రితం ఈ సినిమా విషయంలో మీడియా మీద నాగవంశీ కోప్పడిన విషయం అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ బీమ్లా నాయక్ మూవీ కి కూడా నాగ వంశీనే నిర్మాత.
![]() |
![]() |