![]() |
![]() |
ఒకప్పుడు సినిమా చూడాలంటే తప్పనిసరిగా థియేటర్‌కి వెళ్లాల్సిందే. మరో ప్రత్యామ్నాయం అప్పట్లో లేదు. కాబట్టే చాలా సినిమాలు సిల్వర్ జూబ్లీలు కూడా ఆడేవి. కానీ, ఆ పరిస్థితి కాలానుగుణంగా మారింది. వినోదం అనేది చాలా మాధ్యమాల ద్వారా లభిస్తుండడంతో థియేటర్లకు వెళ్ళే వారి సంఖ్య తగ్గింది. ఇప్పుడు ఓటీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ సంఖ్య మరింత తగ్గింది. కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఓటీటీలోనే సినిమా చూసెయ్యొచ్చు అనుకునేవారికి ప్రతి వారం పండగే. ప్రతివారం కొత్త కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందించేందుకు ఓటీటీ సంస్థలు ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఈ వారం ఓటీటీ ద్వారా 18 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇక్కడ వివేషం ఏమిటంటే ఈసారి ఎక్కువ శాతం సూపర్‌హిట్ సినిమాలే ఉన్నాయి. అవి ఏమిటో ఓసారి పరిశీలిద్దాం.
నెట్‌ఫ్లిక్స్ :
జిగర్ తాండ డబుల్ ఎక్స్ (తెలుగు, డిసెంబర్ 8), అదృశ్య జలకంగల్ ( తెలుగు, డిసెంబర్ 8), దక్ దక్ (హిందీ, డిసెంబర్ 8), ద ఆర్చీస్ (హిందీ, డిసెంబర్ 8), లీవ్ ది వరల్డ్ (ఇంగ్లీష్, డిసెంబర్ 8)
అమెజాన్ ప్రైమ్ :
మస్త్ మైన్ రహానే కా (హిందీ, డిసెంబర్ 8), మేరీ లిటిల్ బ్యాట్ మ్యాన్ (ఇంగ్లీష్, డిసెంబర్ 8), యువర్ క్రిస్మస్ ఆర్ మైన్ 2 (ఇంగ్లీష్, డిసెంబర్ 8), డేటింగ్ శాంటా (స్పానిష్, డిసెంబర్ 8), సిల్వర్ అండ్ ద బుక్ ఆఫ్ డ్రీమ్స్ (జర్మన్, డిసెంబర్ 8),
టగరు పాళ్య (కన్నడ, డిసెంబర్ 8)
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ :
వధువు (తెలుగు సిరీస్, డిసెంబర్ 8), డైరీ ఆఫ్ ఏ వింకీ కిడ్ క్రిస్మస్ : క్యాబిన్ ఫీవర్ (ఇంగ్లీష్, డిసెంబర్ 8)
ఆహా :
మా ఊరి పొలి మేర 2 (తెలుగు, డిసెంబర్ 8)
కీడా కోలా (తెలుగు, డిసెంబర్ 8)
జీ 5 :
కడక్ సింగ్ (హిందీ, డిసెంబర్ 8)
మనోరమ మ్యాక్స్ :
అచనోరు వళ వెచు (డిసెంబర్ 8)
బుక్ మై షో :
ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డిస్ (ఇంగ్లీష్, డిసెంబర్ 8)
లయన్స్ గేట్ ప్లే :
డిటెక్టివ్ నైట్ : రెడంప్చన్ (ఇంగ్లీష్, డిసెంబర్ 8)
![]() |
![]() |