![]() |
![]() |
ప్రపంచవ్యాప్తంగా ‘యానిమల్’ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే రూ.500 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా అదే జోరుతో దూసుకెళుతోంది. రణబీర్ కపూర్, సందీప్‌రెడ్డి కాంబినేషన్ బాగా సెట్ అయ్యిందని అందరూ ప్రశంసిస్తున్నారు. సినిమాపై పలు రకాల విమర్శలు ఉన్నప్పటికీ కలెక్షన్లలో ఆ ప్రభావం కనిపించడం లేదు. సినిమాకి ప్రేక్షకాదరణ విపరీతంగా ఉండడంతో ముంబయిలో స్పెషల్ షోలు వేసేందుకు కూడా అనుమతిస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన అనేక అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశాలుగా మారాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోని ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రణబీర్ కపూర్, రాజమౌళి మధ్య జరిగిన సంభాషణ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో రణబీర్ కపూర్‌ను, సందీప్‌రెడ్డిని రాజమౌళి ప్రశంసలతో ముంచెత్తాడు. ఆ సమయంలోనే రణబీర్‌ను ఒక ప్రశ్న అడిగాడు రాజమౌళి. ‘నువ్వు సినిమా చెయ్యాల్సి వస్తే.. నాతో చేస్తావా.. సందీప్‌తో చేస్తావా?’ అని అడిగాడు. దానికి సమాధానం చెప్పేందుకు కాస్త టైమ్ తీసుకొని ‘ఇద్దరితో చేస్తాను’ అన్నాడు. దానికి రాజమౌళి ‘అలా కాదు.. ఎవరో ఒకరి పేరే చెప్పాలి’ అనడంతో.. ‘సందీప్‌కే ఓకే చెబుతాను సార్. ఎందుకంటే నాకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ విషయంలో సిన్సియర్‌గా ఉండడం ఇంపార్టెంట్ కదా’ అన్నాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. దేశంలోనే టాప్ డైరెక్టర్స్‌లో ఒకడైన రాజమౌళి ఆఫర్ ఇస్తే దాన్ని రణబీర్ కాదనడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే రాజమౌళి మాత్రం రణబీర్ ఇచ్చిన సమాధానానికి అతన్ని మెచ్చుకున్నాడు.
ఈ సంఘటన ఫన్నీగానే ఉన్నప్పటికీ రాజమౌళి అలా అడగడం వెనుక ఏదో కారణం ఉందని, భవిష్యత్తులో రణబీర్‌తో సినిమా చేసే ఆలోచన రాజమౌళికి ఉందా అనే సందేహం అందరికీ కలిగింది. ఇంతకుముందు రణబీర్ చేసిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రానికి రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించి సినిమాని బాగా ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ‘యానిమల్’ చిత్రానికి కూడా రాజమౌళి సపోర్ట్ ఉంది. వేదికపై రాజమౌళి, రణబీర్ మధ్య జరిగిన ఈ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
![]() |
![]() |