![]() |
![]() |

విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సుధీర్ బాబు. గతేడాది 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాతో ఆకట్టుకున్న సుధీర్ బాబు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'మామా మశ్చీంద్ర', పుల్లెల గోపీచంద్ బయోపిక్ వంటి సినిమాలలో నటిస్తున్నాడు. వీటితో పాటు భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రివీల్ చేశారు.
సుధీర్ కెరీర్ లో 16 సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మహేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి 'హంట్' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. దీనికి 'గన్స్ డోంట్ లై' అనేది క్యాప్షన్ కావడం విశేషం. గాయాలతో ఉన్న సుధీర్, గన్, బుల్లెట్, సంకెళ్లు, విభిన్న కట్టడాలతో కూడిన మోషన్ పోస్టర్ కొత్తగా ఆకట్టుకునేలా ఉంది.

ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఘిబ్రాన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా అరుళ్ విన్‌సెంట్, ఎడిటర్ గా ప్రవీణ్ పూడి వ్యవహరిస్తున్నారు. ఇందులో శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
![]() |
![]() |