![]() |
![]() |

సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీలు ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు. అయితే అదే సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి కొన్ని ఇబ్బందికర ప్రశ్నలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. తాజాగా నటి, బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి భూపాలంకు అలాంటి అనుభవమే ఎదురైంది. ఆమెను ఒక నెటిజన్ అడిగారని ప్రశ్న అడిగాడు. అయినా ఆమె ఏ మాత్రం ఇబ్బంది పడకుండా సరదా ఆన్సర్ చెప్పి షాకిచ్చింది.
హయ్యర్ స్టడీస్ కోసం లండన్ వెళ్లిన పునర్నవి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమెకు ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. ఓ నెటిజన్ 'మీరు ఎవరితోనైనా డేటింగ్‌లో ఉన్నారా?' అని అడగగా.. ఆమె అవునని సమాధానం ఇచ్చింది.
ఇక మరో నెటిజన్ అయితే ఏకంగా 'ఆర్ యూ వర్జిన్' అని అడిగేశాడు. అయితే పునర్నవి ఏమాత్రం కోప్పడకుండా చాలా సిల్లీగా తీసుకొని 'నేను ఇలాంటి ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నాను' అంటూ సెటైర్ వేసింది.
![]() |
![]() |