![]() |
![]() |

ఇప్పుడు ఎక్కడైనా సరే 'లైగర్' అనే పదమే వినిపిస్తోంది. పూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ హిట్టా ఫ్లాపా అనే విషయాన్ని పక్కన పెడితే ఈ మూవీ గురించే ఆడియన్స్ చర్చించుకుంటున్నారు. ఇకపోతే ఈ మూవీలో విలన్ గా చేసిన విష్ అలియాస్ విషు రెడ్డి తాజాగా ఇంటర్వ్యూలో ఆయన గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు.
"పూరికి సినిమా అంటే గతంలోకి ఇప్పటికీ ప్యాషన్ పెరిగిందా? తగ్గిందా?" అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. "ఆయన గురించి చెప్పాలంటే "ఆయన పని రాక్షసుడు..ఎప్పుడూ పని, పని.. సినిమా అంటూనే ఉంటారు. ఆయనకు ఏదైనా ఆలోచన వచ్చిందంటే చాలు ఆయన సంచిలో ఎప్పుడూ ఒక టాబ్ ఉంటుంది దాన్ని అందులో ఫీడ్ చేసేసుకుంటారు. హాలిడే కి కానీ, వెకేషన్ కి వెళ్తే అక్కడ కూడా పని గురించే ఆలోచిస్తారు. ఆయనలో సినిమా అంటే కసి ఇంతకుముందుకంటే చాలా పెరిగింది." అన్నాడు.
"ఆయనతో మీ అసోసియేషన్ ఎలా ఉంటుంది?" అన్న ప్రశ్నకు.. "పని ఉంటే చేసుకో అంటారు. ఎక్కడ నెగటివిటీ అనేది రానివ్వరు. ఆయన ఎవరినైనా నమ్మారు అంటే వాళ్ళకే మొత్తం అప్పజెప్తారు. నేను చూసినవాళ్లందరిలో ఆయన ది బెస్ట్ అంటాను. ఆయన గురువు, నా గాడ్ ఫాదర్ అన్ని..ఎలాంటి నెగటివ్ కామెంట్స్ వచ్చినా పెద్దగా పట్టించుకోరు. ఇండస్ట్రీతో నాకు ఎలాంటి సంబంధం లేనప్పుడు..నేను ఆడియన్స్ నుంచి వచ్చినవాడినే. అప్పుడు నేను ఎన్నో గాసిప్స్ విన్నా. కానీ ఎప్పుడైతే ఇండస్ట్రీలోకి వచ్చానో అప్పుడు తెలిసింది అసలు నిజం. బయట మాట్లాడుకునేది వేరు ఇక్కడ ఉండేది వేరు అని. నోరు మారితే మాట మారుతుంది. ఇది కూడా అంతే. అప్పుడనిపించింది మనం ఇంత చెత్తలా ఆలోచిస్తున్నామా అని. విన్న అన్ని మాటలకు గరం మసాలా కలిపి ఎంజాయ్ చేసే బేకార్ గాళ్ళం మనం అనిపించింది. సినిమా వాళ్లకూ కష్టాలుంటాయ్. పైకి కనిపించేదే నిజం కాదు. ప్రతీ రోజు వాళ్ళు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. డబ్బుంటేనే సరిపోదు కదా.." అని చెప్పుకొచ్చాడు విష్.
"ఇస్మార్ట్ శంకర్ మూవీ టైంకి అతని దగ్గర ఉన్నదంతా పోయింది కదా మరి ఇప్పుడు ఆయన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు కదా.. ప్రస్తుత పరిస్థితి ఏమిటి?" అన్న ప్రశ్నకు. "ఆయన ఇప్పటి వరకు అమ్ముకున్నవి చాలు..ఇకనుంచి అన్ని కొనాలి అని అనుకున్నా..అలాగే జరిగింది ఇప్పుడు నాకు హ్యాపీ" అన్నాడు. నెక్స్ట్ విజయ్ తో జనగణమన మూవీ చేస్తున్నారు కదా అందులో మీకేదైన రోల్ ఉందా అని అడిగేసరికి... "తన ఏజ్ కి తగ్గ క్యారెక్టర్స్ లేవు..కానీ తర్వాత వచ్చే మూవీలో ఉందని చెప్పాడు. పూరి గారు ఆ విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు. ఉంటే ఉందని చెప్తారు..లేదంటే లేదు అంటారు. నా సినిమాలు, నా స్క్రిప్టులు నాకున్నాయి. ఉంది కదా అని ప్రతీ దానిలోకి వెళ్లడం కరెక్ట్ కాదు" అని చెప్పుకొచ్చాడు.
రాము కాంపౌండ్ లా పూరి కాంపౌండ్ ఐనట్టేనా అన్న ప్రశ్నకు "అవును..ఆయన ఎంతో మందిని ఇంట్రడ్యూస్ చేశారు, ఆయన తమ్ముడిని, కొడుకుని, ఇంకా ఎంతోమందిని ఇలా..నేను కూడా ఆయన కాంపౌండ్ నుంచి వచ్చిన వాడినే ..పూరి గారి దగ్గర ఎప్పుడూ పని ఉంటుంది. ఆయన ప్రొడక్షన్ వ్యవహారాలు అన్ని నేనే చూసుకునేది కాబట్టి 24 గంటలు సరిపోవడం లేదు ఇంకా కొన్ని గంటలు ఉంటే బాగుండనిపిస్తుంది" అంటూ నవ్వేసాడు. "విజయ్ కూడా బాగా కష్టపడతాడు కదా" అని అడిగేసరికి "చాలా కష్టపడతాడు..సినిమా హిట్టా ఫ్లాపా అనే విషయం తెలియాలంటే విజయ్ ని అబ్సర్వ్ చేస్తే చాలు తెలిసిపోతుంది" అంటూ పూరి వర్కింగ్ నేచర్ గురించి, విజయ్ గురించి ఎన్నో విషయాలు చెప్పాడు విష్.
![]() |
![]() |