![]() |
![]() |

తమిళ సినీ రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న 'ఇళయ దళపతి విజయ్'(Ilaya Thalapathy VIjay)రాజకీయ రంగంలోను తన సత్తా చాటడానికి సిద్దమవుతున్నాడు. అధికారమే లక్ష్యంగా వాడి వేడి ప్రసంగాలతో ప్రత్యర్దులకి సవాలు విసరడంలో ఏ మాత్రం వెనకాడటం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విజయ్ కి 'వై ప్లస్' భద్రత కల్పించింది. 'వై ప్లస్' అనేది దేశంలోనే నాలగవ అత్యున్నత స్థాయి భద్రత. కమెండోలు, పోలీస్ లతో కలుపుకొని మొత్తం పదకొండు మంది షిఫ్టులు వారీగా పర్యవేక్షిస్తుంటారు.
వీరంతా విజయ్ ప్రచార కార్యక్రమాలతో పాటు, విజయ్ ఇంటికి కట్టుదిట్టమైన భద్రతని కల్పిస్తుంటారు. దీంతో ముందస్తు పర్మిషన్ లేకుండా మాములు వ్యక్తులు, విజయ్ ఇంటి పరిసరాల్లోకి వెళ్లడం అనేది అసాధ్యం. కానీ విజయ్ ఇంటి టెర్రస్ పై గుర్తు తెలియని యువకుడు ప్రత్యక్షమయ్యాడు. దీంతో భద్రత సిబ్బంది షాకయ్యి, యువకుడ్ని అదుపులోకి తీసుకొని విచారించారు. యువకుడు పేరు 'అరుణ్' గా గుర్తించడంతో పాటు, అతని మానసిక పరిస్థితి సరిగా లేదని తేలడంతో, సదరు యువకుడ్ని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ఇక విజయ్ ఇంటిపై యువకుడు కనపడిన సంఘటనతో అభిమానులు షాక్ కి గురయ్యారు. ఆ తర్వాత విషయం తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ 'వై ప్లస్' భద్రత ఉండి కూడా ఒక యువకుడు ఎలా లోపలికి వచ్చాడనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతుండటంతో, పోలీసులు తమ విచారణని కొనసాగిస్తునే ఉన్నారు.
విజయ్ సినీ జర్నీ విషయానికి వస్తే అప్ కమింగ్ మూవీ 'జననాయగ' షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. పొలిటికల్ యాక్షన్ అంశాలతో తెరకెక్కుతుంది. విజయ్ తన 'తమిళ వెట్రి కళగం' పార్టీ ద్వారా, వచ్చే ఏడాది ఏప్రిల్, మే మధ్య జరిగే ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నాడు. దీంతో 'జననాయగాన్' కథ ఏ విధంగా ఉండబోతుంది, అందులో ఏ ఏ అంశాలని పొందుపరిచారనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో నెలకొని ఉంది. పొంగల్ సందర్భంగా జనవరి 9 న రిలీజ్ కాబోతున్న 'జననాయగాన్' కి హెచ్ వినోద్ దర్శకుడు. 'పూజాహెగ్డే'(Pooja Hegde),ప్రేమలు ఫేమ్ 'మమితా బైజు'(Mamitha Baiju)బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ మ్యూజిక్.
![]() |
![]() |