![]() |
![]() |

పాయల్ రాజ్‌పుత్ పేరు చెబితే తెరపై ఆమె చేసిన బోల్డ్ క్యారెక్టర్లు గుర్తొస్తాయి. 'ఆర్ఎక్స్ 100', 'ఆర్‌డిఎక్స్ లవ్' సినిమాల ప్రభావం అటువంటిది. సినిమాల్లో మాత్రమే కాదు... నిజజీవితంలోనూ పాయల్ చాలా బోల్డ్. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పిల్లో ఛాలెంజ్, పేపర్ ఛాలెంజ్ అంటూ ఆమె పోస్ట్ చేసే ఫోటోలు చూస్తే తెలుస్తుంది. అమ్మాయిలకు అంతే బోల్డ్ గా పాయల్ సలహాలు ఇస్తోంది.
అమ్మాయిలకు ఈవ్ టీజింగ్ బెడద ఎక్కువే. ఎదవలు ఏడిపిస్తూ ఉంటారు. ఈవ్ టీజింగ్ ఎదురైనప్పుడు ఆత్మ రక్షణ కోసం ఏం చేయాలి అని ఒక అమ్మాయి పాయల్ ను సలహా అడిగింది. "అటువంటి సమయంలో మరింత తెలివిగా, చురుగ్గా వ్యవహరించాలి. దెబ్బ కొడితే వెంటనే గాయమయ్యే అవయవాలు చూసి కొట్టాలి. కళ్ళు, ముక్కు, గొంతు, నోరు, బాల్స్ (మగవాళ్ళ సెంటర్ పాయింట్) తదితర ప్రదేశాలపై కొట్టండి" అని పాయల్ చెప్పారు. సాధారణంగా ఆమెను వ్యతిరేకించే వాళ్ళు సైతం ఈ సలహాకు సపోర్ట్ చేస్తున్నారు.
![]() |
![]() |