![]() |
![]() |

ఈ భూమ్మీద మానవ జాతి ఉన్నట్టే రాక్షస జాతి కూడా ఉంది. కాకపోతే రాక్షస జాతి కి సపరేట్ ఆకారం, స్థావరం అంటూ ఏది లేదు. సాధారణ మనుషుల రూపు రేఖలతోనే సొసైటీ లో తిరుగుతూ మనుగడని కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రవర్తించే తీరు ద్వారా రాక్షస జాతి అని చాలా ఈజీగా నిర్దారించుకుంటాం. అలాంటి జాతిలోని ఒక తాను ముక్క శ్రీ రెడ్డి.. లేటెస్ట్ గా రామోజీరావు (ramoji rao) మరణం పై కామెంట్స్ చేసి చర్చల్లో నిలిచింది.
దేవుడా నువ్వు ఉన్నావు. బోణి కొట్టాం. నా పూజలు ఫలించడం స్టార్ట్ అయ్యాయి. లెగ్ బాబు, మాములు లెగ్ కాదు.కమ్మని గురువు రామోజీ ,ఫస్ట్ వికెట్ డౌన్ అని ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ చూసిన చాలా మంది శ్రీ రెడ్డి అసలు మనిషేనా అని అంటున్నారు. శత్రువైనా సరే ఇంటికి వస్తే అన్నం పెట్టే సంప్రదాయం తెలుగు వారి సొంతం. అలాంటిది ప్రతి తెలుగు వాడు గర్వించదగ్గ రామోజీ గారు మరణిస్తే బాధపడాల్సింది పోయి ఆ విధంగా మాట్లాడుతుందా అంటున్నారు. కొంత మంది అయితే శ్రీ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
ఇక ఈనాడు టీవీ, సినీ బృందం అయితే ఒకటే మాట చెప్తుంది. ఒక మనిషిని అకారణంగా దూషించడం, బాధపెట్టడం మహా పాపం. అలాంటిది కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగుని నింపి వాళ్ళ బతుకులకి ఒక దారి చూపించిన రామోజీ గారిని అంటే ఆ పాపం శ్రీ రెడ్డి కి ఖచ్చితంగా తగులుతుందని అంటున్నారు. వాళ్ళు అనే మాటల్లో నిజం ఉంది. ప్రకృతి అన్ని చూస్తుంటుంది. ఎవరిని వదలదు. ఇదే ప్రస్తుతం నడుస్తున్న మానవ చరిత్ర.
![]() |
![]() |