![]() |
![]() |

నటనకి సరికొత్త కిరీటాన్ని అద్దిన హీరో రాజేంద్ర ప్రసాద్(Rajendra prasad)అందుకే ఆయన్ని నటకిరిటీ అంటారు. నాలుగున్నర దశాబ్దాల నుంచి ఎన్నో వైవిధమైన పాత్రలని పోషిస్తు ప్రేక్షకులని తన నటనతో అలరిస్తు వస్తున్నాడు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ పి వి నరసింహారావు అంతటి వ్యక్తే రాజేంద్ర ప్రసాద్ కి అభిమాని.అంతటి లెజండరీ హీరో అయిన రాజేంద్ర ప్రసాద్ రామోజీరావు మరణంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు.
రామోజీరావు(ramoji rao)గారి కంపెనీలోనే నేను హీరోని అయ్యాను.నన్ను తన బిడ్డ లాగా భావించి జీవితంలో ఎలా ఉండాలో అని ఎన్నో విషయాలని నేర్పారు. నీకు గుర్తింపు ఉన్న చోటుకే వెళ్ళు. అది లేని చోట నువ్వు ఉండకని పదే పదే చెప్పేవారు. కానీ అంత పెద్ద గొప్ప వ్యక్తి చివర్లో దరిద్రపు రాజకీయాల వల్ల మనో క్షోభ అనుభవించాడు. వాళ్ళని భగవంతుడు చూసుకున్నాడు. వాళ్ళ పరాజయాన్ని చూసి గెలిచి వెళ్లాడని చెప్పాడు. రామోజీ రావు గారిని పెద్దాయన అని ఆప్యాయంగా పిలుచుకుంటానని ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు
గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామోజీరావు గారి మీద ఎలాంటి ఆధారాలు లేకుండానే కావాలని పోలీసు కేసులని పెట్టింది. అప్పట్లో ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దీంతో చాలా మంది గత ప్రభుత్వానికి శాపనార్ధాలు పెట్టారు. ఇప్పుడే ఆ శాపాలే నిజం అయ్యాయి.
![]() |
![]() |