![]() |
![]() |
.webp)
హైదరాబాద్ జల్ పల్లిలో ఉన్న సౌందర్యకు చెందిన ఆరు ఎకరాల గెస్ట్ హౌస్ ను మోహన్ బాబు అక్రమంగా అనుభవిస్తున్నాడు అంటూ.. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఆస్తి కోసం సౌందర్యను హత్య చేయించారంటూ ఫిర్యాదులో దారుణమైన ఆరోపణలు చేశాడు. అయితే ఈ ఆరోపణలు నమ్మశక్యంగా లేకపోవడంతో.. ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తి మానసిక పరిస్థితి ఎలా ఉండనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఈ అంశంపై సౌందర్య భర్త రఘు స్పందించారు. మోహన్ బాబు పై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశాడు. (Mohan Babu)
"మోహన్ బాబు గారు మరియు సౌందర్యకు సంబంధించి హైదరాబాద్లోని ఆస్తి గురించి గత కొన్ని రోజులుగా తప్పుడు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నేను ఖండిస్తున్నాను. నా భార్య సౌందర్య నుంచి మోహన్ బాబు గారు ఎటువంటి ఆస్తిని అక్రమంగా తీసుకోలేదని స్పష్టం చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు మేము ఆయనతో ఎలాంటి భూ లావాదేవీలు జరపలేదు. గత 25 సంవత్సరాల నుండి మోహన్ బాబు గారితో మాకు మంచి అనుబంధం ఉంది. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి." అని రఘు రాసుకొచ్చారు.

![]() |
![]() |