![]() |
![]() |

దక్షిణ భారతీయ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని నటుడు మలయాళ సూపర్ స్టార్ 'మోహన్ లాల్'(Mohanlal).మలయాళ చిత్ర సీమలో నాలుగున్నర దశాబ్దాలుగా అగ్ర హీరోగా కొనసాగుతు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అత్యద్భుతమైన క్యారక్టర్ లని పోషించి అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించాడు.తెలుగు ప్రేక్షకులకి కూడా గాండీవం,కాలాపాని,జనతా గ్యారేజ్,జైలర్ వంటి చిత్రాలతో అభిమాన నటుడుగా మారాడు.
రీసెంట్ గా మోహన్ లాల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ మోహన్ లాల్ తో 'మలయాళ చిత్ర పరిశ్రమ వల్లే మీకు గుర్తింపు వచ్చిందా అని అడగడం జరిగింది.అందుకు మోహన్ లాల్ మాట్లాడుతు మలయాళ చిత్ర పరిశ్రమ వల్లే నాకు గుర్తింపు వచ్చింది.అందుకే వేరే లాంగ్వేజ్ లో అవకాశాలని వెతుక్కుంటూ వెళ్లకుండా ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను.సాంకేతికంగాను మలయాళ చిత్ర పరిశమ్ర ఎంతగానో అభివృద్ధి చెందింది.ఇక్కడి ప్రేక్షకులకి సినిమాలపై ఉన్న అభిమానం వల్లే గొప్ప చిత్రాలు తెరకెక్కుతున్నాయి.కళాత్మక చిత్రాలు తెరకెక్కించడంలోను మలయాళ మేకర్స్ ముందుంటారు.అందుకే ఇతర భాషల్లో కంటే మలయాళంలో గొప్ప చిత్రాలు తెరకెక్కుతున్నాయి.
ఈ మార్పు కాలక్రమేణా వచ్చింది తప్ప ఓవర్ నైట్ వచ్చింది కాదు.ఇలాంటి గొప్ప పరిశ్రమలో భాగమైన నేను వేరే ఇండస్ట్రీ వైపు ఎందుకు చూడాలని చెప్పుకొచ్చాడు.మోహన్ లాల్ ప్రస్తుతం 'ఎంపురన్'(Empuraan)అనే మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.2019 లో మోహన్ లాల్ తన నట విశ్వరూపాన్ని చూపించడంతో సంచలన విజయాన్ని అందుకున్న లూసిఫర్ కి రీమేక్ గా ఎంపురన్' తెరకెక్కింది.స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్(Prithvi raj sukumaran)దర్శకత్వం వహించగా మార్చి 27 న థియేటర్ లో సందడి చేయనుంది.లూసిఫర్ ని గాడ్ ఫాదర్ గా తెలుగులో చిరంజీవి(Chiranjeevi)రీమేక్ చేసిన విషయం తెలిసిందే.మంచు మోహన్ బాబు(Mohan Babu)విష్ణు ప్రెస్టేజియస్ట్ మూవీ 'కన్నప్ప'(Kannappa)లో కూడా మోహన్ లాల్ కీలకపాత్ర పోషించాడు.ఏప్రిల్ 25 కన్నప్ప(Kannappa)వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.
![]() |
![]() |