Home  »  News  »  తిరుమల శ్రీవారి దర్శనంపై లిటిల్ హార్ట్స్ హీరోయిన్ కీలక వ్యాఖ్యలు 

Updated : Feb 25, 2026

 

 

-లిటిల్ హార్ట్స్ తో యూత్ హార్ట్స్ లో స్టే చేస్తున్న శివాని 
-ఇప్పుడు హే బలవంత్ తో థియేటర్స్ లో సందడి 
-వేంకటేశ్వర స్వామి దర్శనంపై తను ఏం మాట్లాడింది
-అసలు ఎందుకు మాట్లాడవలసి వస్తుంది

శివాని నాగారం(Shivani Nagaram)..తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్ కి దొరికిన అచ్చ తెలుగు నటి. ఫస్ట్ మూవీ  అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ నుంచి రీసెంట్ గా వచ్చిన 'హే బల్‌వంత్' (Hey balwanth)వరకు శివాని ప్రదర్శించే పెర్ఫార్మ్ కి ఆమె అసలు పేరుని మర్చిపోయి సదరు సినిమాలోని క్యారక్టర్స్ పేరుతో పిలుస్తుంటాం. అంతలా తన సెటిల్డ్ పెర్ఫార్మ్ తో మెస్మరైజ్ చేస్తుంది. రీసెంట్ గా ఈ అమ్మడు కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి(Tirumala Tirupati Sri venkateswara Swami)విషయంలో తనపై వస్తున్న కొన్ని విమర్శలకి సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విషయమేంటో చూద్దాం.

శివాని నాగారం ఇటీవల హే బలవంత్ ప్రమోషన్స్ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'తిరుమలలో 15 నిమిషాల పాటు స్వామివారి దర్శనం కలిగిందనే విషయాన్నీ వెల్లడి చేసింది. శివాని అలా చెప్పిందో లేదో నిమిషాల్లోనే ఆ మాట వైరల్ గా మారడంతో పాటు సెలబ్రిటీలకు టీటీడీ పెద్దపీట వేస్తోందని నెటిజన్స్ విమర్శనాస్త్రాలు గుప్పిస్తు కామెంట్స్ చేయడం  స్టార్ట్ చేసారు. దీంతో విమర్శలు చేస్తున్న వాళ్ళకి దర్శనంపై తన పూర్తి ఆంతర్యం అర్ధం కావాలని శివాని తాజాగా ఒక వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతు మా అమ్మ,నేను 10500 రూపాయిల శ్రీవాణి దర్శనం టికెట్లు తీసుకొని దర్శనానికి వెళ్ళాం. లైన్‌లో వెళ్తున్నపుడు స్వామి వారిని కొంచెం కొంచెం చూస్తూ వెళ్తుంటాం కదా. ఆ విధంగా కనిపించే మొత్తం సమయం కలిపి 15 నిమిషాలు అయ్యింది. దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎగ్జైట్మెంట్ తో అందరితో షేర్ చేసుకున్నాను. అంతేకానీ స్వామి ముందు గర్భాలయంలో నన్ను ఎవరు 15 నిమిషాల పాటు ఉంచలేదు. మీలో కూడా ఎవరైనా ఎప్పుడైనా సరే శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకొని వెళ్తే కచ్చితంగా స్వామివారి దర్శనం చాలా మంచిగా జరుగుతుంది. మీరు కూడా నేను పొందిన అనుభూతినే పొందుతారని శివాని చెప్పుకొచ్చింది. శ్రీవాణి దర్శనం టికెట్ ని కూడా ఆమె చూపించడం విశేషం.

Also read:Pawan kalyan: పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి చేదు అనుభవం.. ఎవరి నుంచో తెలిస్తే షాక్ అవుతారు 

దీంతో విమర్శలు చేసే వాళ్ళు శివాని ఇచ్చిన క్లారిటీ పై సంతృప్తి చెందటం ఖాయం.    ప్రస్తుతం తన నుంచి కొత్త చిత్రం ప్రకటన రాకపోయినా పలు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.