Home  »  News  »  Aaya Sher: చికిరి vs ఆయా షేర్.. ప్యారడైజ్ సౌండ్ మామూలుగా లేదు!

Updated : Feb 25, 2026

  • 'చికిరి' బాటలో 'ఆయా షేర్'
  • సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'ప్యారడైజ్' సాంగ్
  • ఆడియన్స్ నుంచి పొలిటీషియన్స్ వరకు అందరూ ఫిదా

సినిమా ప్రమోషన్స్ లో సాంగ్స్ కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఆడియో పరంగా, విజువల్ పరంగా సాంగ్ హిట్ అయిందంటే.. సినిమాకి బోలెడంత మైలేజ్ వస్తుంది. ఇటీవల 'పెద్ది'(Peddi) విషయంలో అది జరిగింది. తాజాగా ఆ లిస్టులో 'ది ప్యారడైజ్'(The Paradise) చేరింది.

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'పెద్ది'. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న 'పెద్ది' నుంచి ఫస్ట్ సింగిల్ గా 'చికిరి చికిరి' విడుదలై చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఆడియో పరంగా హిట్ అవ్వడమే కాకుండా, అందులో హుక్ స్టెప్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. అప్డేట్స్ వచ్చినా రాకపోయినా కొద్దినెలలుగా సోషల్ మీడియాలో 'పెద్ది' గురించి తెగ చర్చ జరుగుతుంది అంటే దానికి ప్రధాన కారణం 'చికిరి చికిరి' సాంగ్ అనడంలో డౌట్ లేదు. ఇప్పుడు 'ఆయా షేర్' రూపంలో 'ప్యారడైజ్' టైం స్టార్ట్ అయింది. (Aaya Sher)

'దసరా' తరువాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న ఫిల్మ్ 'ది ప్యారడైజ్'. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ 'ఆయా షేర్' విడుదలైంది. 'ప్యారడైజ్'లో జడల్ అనే పాత్రలో నెవర్ బిఫోర్ లుక్ లో నాని కనిపిస్తున్నాడు. ఆ జడల్ పాత్రను ఎలివేట్ చేస్తూ 'ఆయా షేర్' సాంగ్ సాగింది. అనిరుధ్ మ్యూజిక్ పవర్ ఫుల్ గా ఉంది. విజువల్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ముఖ్యంగా హుక్ స్టెప్స్ అదిరిపోయాయి. సిగరెట్ వెలిగిస్తూ వేసే స్టెప్, జడ పట్టుకొని వేసే స్టెప్ హైలైట్ గా నిలిచాయి.

'ఆయా షేర్' సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూట్యూబ్ ట్రెండింగ్ లో నెం.1 ప్లేస్ లో ఉంది. ఈ సాంగ్స్ తో ప్రముఖ రాజకీయ నాయకుల ఎడిట్స్ కూడా సోషల్ దర్శనమిస్తున్నాయి. కేసీఆర్ ఎడిట్ ని కేటీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎడిట్స్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో అందరి నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని అందుకుంటూ, తక్కువ టైంలోనే ఇంత రీచ్ పొందిన పాటలు చాలా తక్కువ ఉన్నాయి. 'ఆయా షేర్'కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. ప్యారడైజ్ కి బోలెడంత మైలేజ్ వచ్చినట్టే అని చెప్పవచ్చు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 21న రిలీజ్ కానుంది.

Also Read: 'అతడు' సెకండ్ రీ రిలీజ్ బుకింగ్స్.. మహేష్ బాబు మాస్ ర్యాంపేజ్!

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.