![]() |
![]() |
కథానాయికగా తెలుగమ్మాయి అంజలిది పదహారేళ్ళ ప్రయాణం. ఈ ప్రస్థానంలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటిగా తనదైన ముద్రవేసింది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. కేవలం కథానాయిక పాత్రలకే పరిమితం కాకుండా సహాయక పాత్రల్లోనూ, అతిథి వేషాల్లోనూ, ప్రత్యేక గీతాల్లోనూ దర్శనమిచ్చింది అంజలి. ప్రస్తుతం అంజలి.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ - ఇండియా మూవీలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది.
ఇదిలా ఉంటే, దాదాపు పదేళ్ళ క్రితం కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన `సింగం 2` (2013) కోసం ఓ స్పెషల్ సాంగ్ లో నర్తించిన అంజలి.. ఆపై 2016లో ఎంటర్టైన్ చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ `సరైనోడు`లోనూ బ్లాక్ బస్టర్ డాన్స్ నంబర్ లో చిందులేసిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే.. ఆరేళ్ళ తరువాత అంజలి మరో ప్రత్యేక గీతంలో కనిపించనుందని బజ్. ఆ వివరాల్లోకి వెళితే.. యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా `మాచర్ల నియోజక వర్గం` పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో `ఉప్పెన` భామ కృతి శెట్టి నాయికగా నటిస్తోంది. కాగా, కథానుసారం ఇందులో ఓ స్పెషల్ సాంగ్ వస్తుందట. అందులో అంజలి ఎంటర్టైన్ చేయనుందని అంటున్నారు. త్వరలోనే `మాచర్ల నియోజకవర్గం`లో అంజలి ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
![]() |
![]() |