![]() |
![]() |
`ఉప్పెన`, `శ్యామ్ సింగ రాయ్`, `బంగార్రాజు` చిత్రాలతో తెలుగు కుర్రకారుని ఫిదా చేసి.. హ్యాట్రిక్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది కృతి శెట్టి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` విడుదలకు సిద్ధమైంది. మరోవైపు.. కృతి శెట్టి నాయికగా అభినయిస్తున్న `మాచర్ల నియోజక వర్గం`, `ద వారియర్` చిత్రీకరణ దశలో ఉన్నాయి. వీటిలో `ద వారియర్` తెలుగుతో పాటు తమిళంలోనూ తెరకెక్కుతోంది.
ఇదిలా ఉంటే, తాజాగా కృతి శెట్టికి నేరుగా ఓ తమిళ సినిమాలో నటించే అవకాశం దక్కిందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. `నంద`, `పితామగన్` చిత్రాలతో కోలీవుడ్ స్టార్ సూర్యలోని నటుడ్ని విభిన్న కోణంలో ఆవిష్కరించిన దర్శకుడు బాల.. త్వరలోనే సూర్యతో హ్యాట్రిక్ మూవీని పట్టాలెక్కించనున్నారు. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేయడమే కాకుండా.. ఓ పాత్ర కోసం మూగ, చెవిటి వ్యక్తిగా దర్శనమివ్వనున్నారు. కాగా, ఈ చిత్రంలో ముగ్గురు నాయికలకు స్థానముండగా, వారిలో ఒకరిగా జ్యోతిక నటించనుందని కోలీవుడ్ బజ్. లేటెస్ట్ టాక్ ఏంటంటే.. ఇందులో కృతి శెట్టి కూడా నటించబోతోందట. అంతేకాదు.. బాల గత చిత్రాల్లాగే ఇందులోనూ నాయికలవి డి-గ్లామర్ రోల్స్ అని వినిపిస్తోంది. మరి.. సూర్య కోసం కృతి శెట్టి ఇవ్వనున్న ఈ `డి-గ్లామర్` టచ్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. త్వరలోనే సూర్య - బాల కాంబో మూవీలో కృతి శెట్టి ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
![]() |
![]() |