![]() |
![]() |

పదహారేళ్ళ తర్వాత 'పోకిరి' తరహా పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు మహేష్ బాబు. అదే 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా మే 12 న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కి, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది.
'సర్కారు వారి పాట' ట్రైలర్ ను మే 2 న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ లో మహేష్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. చేతిలో పెద్ద తాళాల గుత్తి పట్టుకొని రౌడీని కొట్టడంతో అతను గాలిలో ఎరుగుతుండగా.. మిగతా రౌడీ గ్యాంగ్ భయపడుతున్నట్లుగా పోస్టర్ లో ఉంది. మహేష్ రౌడీని తన్ని సీరియస్ గా చూస్తూ కాలుని భూమిపై ల్యాండ్ చేస్తున్నట్లుగా పవర్ ఫుల్ గా ఉంది పోస్టర్. ఈ పోస్టర్ చూసి బాబు ల్యాండ్ అయితే రికార్డులకు బ్యాండే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్, సినిమా కూడా ఈ పోస్టర్ లాగే సాలిడ్ గా ఉంటాయేమో చూడాలి.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.
![]() |
![]() |