![]() |
![]() |

ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుడు తో ఇందుగలడు అందుకలడు ఎందెందు వెతికినా శ్రీ మహావిష్ణువే ఉంటాడు అని అంటాడు. ఇప్పుడు సేమ్ వరల్డ్ లో ఎక్కడ చూసినా సలార్ సినిమా సాధించిన రికార్డు దర్శనం ఇస్తుంది. తాజాగా ఇంకో రికార్డు తనంత తానుగా వచ్చి సలార్ లో కలిసిపోయింది.
సలార్ యుఎస్ లో అక్షరాలా 70000 ప్రీమియర్ ప్రీ సేల్స్ టికెట్స్ తో ముందుకు దూసుకుపోతుంది. ఈ విధంగా 1.81 మిలియన్ డాలర్స్ తో రికార్డు స్థాయి కలెక్షన్స్ ని సాధించింది. ఇప్పుడు ప్రభాస్ సృష్టించిన ఈ ఫ్రెష్ రికార్డ్ సాదా సీదా రికార్డు కాదు. యు ఎస్ సినీ చరిత్రలో ఇంతవరకు ఏ ఇండియన్ సినిమా కూడా సలార్ స్థాయిలో ప్రీ సేల్స్ బుకింగ్ ని సాధించలేదు.

ఇప్పుడు ఈ రికార్డు తో ఇండియన్ సినిమాకి ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి అర్ధం అయ్యింది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ వరుసగా పరాజయం చెందినప్పటికీ సలార్ కి ఈ స్థాయిలో క్రేజ్ రావడం పట్ల సినీ విశ్లేషకులు తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
![]() |
![]() |