![]() |
![]() |

విక్టరీ వెంకటేష్(venaktesh)నుంచి సంక్రాంతి కానుకగా ఈ నెల 13 న వచ్చిన మూవీ సైంధవ్ ( saindahv) మొదటి రోజు కొంచెం నెగిటివ్ టాక్ ని అందుకున్న ఈ మూవీ రోజు రోజుకి హిట్ టాక్ తో ముందుకు దూసుకెళ్తుంది. మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద వెంకటేష్ పండించిన పెర్ ఫార్మెన్స్ కి ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక న్యూస్ వెంకీ అభిమానులని ఆనందంలో ముంచెత్తుతుంది.
సైంధవ్ అమెరికా లో దుమ్ము రేపుతుంది. ఇప్పటికే 300 k డాలర్స్ వసూలు చేసి విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే అత్యధిక వసూలు సాధించిన సినిమాగా నిలిచింది. దీన్ని బట్టి సైంధవ్ కి యుఎస్ ప్రేక్షకుల నుంచి ఎంత ఆదరణ లభిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే ఇండియా వైడ్ గా మొదటి రోజు 3 .8 కోట్లు, రెండవ రోజు 2 .8 కోట్లు, మూడవ రోజు 3.35 కోట్లు ఇలా రోజు రోజుకి కలెక్షన్స్ ని పెంచుకుంటు వెంకటేష్ కెరీర్ లోనే నెంబర్ వన్ చిత్రంగా సైంధవ్ నిలిచేలా ఉంది
కండరాల సమస్యతో బాధపడుతున్న తన కూతురు ప్రాణాలని రక్షించుకోవడానికి వెంకటేష్ చేసిన పోరాటం ప్రతి ఒక్క ప్రేక్షకుడ్ని కట్టిపడేస్తుంది. వెంకటేష్ తో పాటు శ్రద్ద శ్రీనాధ్,రుహాణి శర్మ, ఆండ్రియా,నవాజుద్దిన్ సిద్ధికి తదితరులు నటించిన ఈ చిత్రానికి వెంకట్ బోయినపల్లి నిర్మాత కాగా శైలేష్ కొలను(sailesh kolanu)దర్శకుడు.
![]() |
![]() |